Pawan Kalyan: పిన్నాపురం గ్రీన్‌కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ పరిశీలన..
- ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనే పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు
- ఇది భారీ ప్రాజెక్ట్
- చిన్నచిన్న తప్పులుంటే సరిదిద్దాలి
- ఏమైనా సమస్యలు ఇంటే కేబినెట్ దృష్టికి తీసుకెళ్తా -డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్‌కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్స్ ఉన్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ప్రాజెక్టు విజిట్ చేశామని చెప్పారు. సోలార్, హైడల్, జల విద్యుత్.. పొల్యూషన్ లేని విద్యుత్ ఇక్కడ తయారవుతుందని అన్నారు. అనిల్ చలంశెట్టి, మహేష్ గ్రీన్ కో ప్రారంభించారని తెలిపారు. దేశంలో లక్షన్నర కోట్లు పెటుబడి పెట్టారు.. ఏపీలో రూ.30 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు.. మరో రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. పిన్నపురంలో రూ.10 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు, ఇంకా 14 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పారు.
Mahesh Babu : మార్షల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
అటవీ నిబంధనలు ఉల్లగించారంటే చూడ్డానికి వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. 2800 ఎకరాల్లో 1700 ఎకరాలు కొన్నారు.. రాళ్లు రప్పలు ఉండి వ్యవసాయానికి పనికి రాని భూముల్లో ప్రాజెక్టు నిర్మిస్తున్నారన్నారు. చంద్రబాబు ఐటీ తరువాత గ్రీన్ ఎనర్జీ పై దృష్టి పెట్టారు.. అందులో భాగంగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దేశానికి ప్రతిష్టాత్మకమైనది రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టు అని అభిప్రాయపడ్డారు. దేశానికి రెండున్నర లక్షల పెట్టుబడులు తీసుకురాగలిగారు.. 365 ఎకరాలు కేంద్రం నుంచి అటవీ భూమి కొన్నారు, అందుకు కంపెనీ 365 ఎకరాల భూమి నెల్లూరు జిల్లాలో ఇచ్చారని వెల్లడించారు. 40 ఎకరాల భూమి ఫారెస్టు, రెవెన్యూ మధ్య వివాదం ఉంది.. దీన్ని పరిశీలించడానికి వచ్చానని చెప్పారు.
Congress : ఈనెల 27న తెలంగాణకు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ.
ఆఫీసులో కూర్చొని సమీక్షించడానికి, ఫీల్డ్‌కి వెళ్లి సమీక్షించడానికి తేడా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇది భారీ ప్రాజెక్టు.. ఇందులో చిన్న చిన్న వయోలేషన్స్ ఉంటే కరెక్షన్ చేయాలని అధికారులకు సూచించారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. పర్యాటక ప్రాంతంగా, ఎడ్యుకేషన్ టూర్ ప్లేస్‌గా అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద యువతకు ఉపాధి కల్పించే పనులు, రైతులకు ప్రయోజనాలు కల్పించే పనులు యాజమాన్యం చేయాలని తెలిపారు. 43 లక్షల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు ఇవ్వగలిగెంత విద్యుత్ ఇక్కడ ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. కడప, చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఆక్రమణకు గురవుతున్నాయని.. అటవీశాఖ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, అటవీ భూముల వివాదాలపై సమీక్ష చేస్తానని చెప్పారు. కర్నూలు అద్భుతమైన నగరం కావాలని తెలిపారు. అలాగే.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!