ఉత్తరప్రదేశ్‌లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
West Bengal: పశ్చిమ బెంగాల్లో రెండు సింహాలకు పెట్టిన పేర్లు వివాదాస్పదమయ్యాయి. త్రిపుర నుంచి బెంగాల్ సఫారీ పార్కుకు తీసుకువచ్చిన ఆడ సింహానికి ‘సీత’ అని పేరుపెట్టడంపై విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) హైకోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టులోని జల్పాయిగురి సర్క్యూట్ బెంచ్ హిందూ సంస్థ తరుపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆడ సింహానికి ఎలాంటి పేరు పెట్టలేదని పార్క్ అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆహ్వానించింది. రామమందిర నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన అద్వానీ, జోషిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని మొదట ఆలయ ట్రస్ట్ తెలిపిన విషయం తెలిసిందే. వారి వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఈ వేడుకకు రావోద్దని వారిని అభ్యర్థించినట్టు రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. వారి వయస్సును పరిగణనలోకి…
జగిత్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటనపై రూరల్ ఎస్సై అనిల్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. రేపటి జగిత్యాల పట్టణ బంద్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Love Jihad: లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ముంబైలో వేలాదిమంది రోడ్లపై భారీ ప్రదర్శన చేపట్టారు. ముస్లింలు హిందువుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, హిందూ యువతులను ప్రేమ పేరుతో తీసుకెళ్లి, మతం మార్చుతుండటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
Boycott on Muslim traders in Karnataka temple fair: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ మహాలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) మరో వర్గం వారికి వార్నింగ్ ఇస్తోంది. దీనికి సంబంధించి ఆలయ పరిసరాల్లో ఓ పోస్టర్ కూడా ఏర్పాటు చేసింది. హిందూ మతం, సంప్రదాయాలపై విశ్వాసం ఉన్న హిందూ వ్యాపారులు మాత్రమే వాణిజ్యం నిర్వహించడానికి అవకాశం ఉంటుందని బ్యానర్ లో పేర్కొన్నారు.
VHP warning on Christmas celebrations: క్రిస్మస్ వేడుకలపై హిందూ సంస్థ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ భోపాల్ లోని పాఠశాలలు విద్యార్థులు ఎవరూ కూడా శాంతాక్లాజ్ వేషధారణ ధరించేందుకు అనుమతించకూడదని హెచ్చరించింది. ఇదే విషయంపై భోపాల్ నగరంలోని అన్ని విద్యాలయాలకు వీహెచ్‌పీ లేఖలు రాసింది. సనాతన హిందూ మతం, సంస్కృతిని విశ్వసించే విద్యార్థులను క్రిస్మస్ చెట్లను తీసుకురావానలి.. శాంటాక్లాజ్ దుస్తులు ధరించాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించింది.
ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు గత వారం దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ముఖ్యంగా యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్, సహరాన్ పూర్ ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి. జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పోలీసులకు, ఆందోళనకారుల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో…