Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missing Meghana First Look: తెలుగు ప్రేక్షకులను సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లతో ఆకట్టుకునే మరో కొత్త మూవీ ‘మిస్సింగ్ మేఘన’ త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా ఆగస్టు 5న ‘మిస్సింగ్ మేఘన’ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఒక ఆసక్తికరమైన సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. వాచస్పతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తుండగా, ఆర్. ఆర్. ధృవన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కథలో మిస్టరీ, థ్రిల్, ఇన్వెస్టిగేషన్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు నిర్మాత బెక్కం వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ, దర్శకుడు వాచస్పతి, హీరో రామ్ కార్తీక్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అలాగే సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ ను కూడా అభినందిస్తూ. ఈ మూవీ విజయవంతం కావాలని కోరుకున్నారు. దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, వీవీ వినాయక్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది పూర్తి స్థాయి సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని, ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయని చెప్పారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఫస్ట్ లుక్ విడుదలతోనే ‘మిస్సింగ్ మేఘన’ పై ఆసక్తి పెరిగింది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి అనుభూతిని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Tags
- cinema
- Missing Meghana
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!