YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో డీఎస్సీ-2025 నియామకాల వ్యవహారం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ఈ దీక్షా శిబిరం ఏర్పాటు అనుమతి లేకుండానే జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ క్రమంలో దీక్షా శిబిరం టెంట్‌ను టీడీపీ శ్రేణులు తొలగించగా.. దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను నిలువరించి.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విజయవాడలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తును ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.
Also Read
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలని వైసీపీ దీక్షలో పాల్గొన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెలి మాట్లాడుతూ… ‘మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. సీబీఐ విచారణ జరపించాలి. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఉద్యోగాలలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి, జీవోలు తారుమారు అయ్యాయి. విద్యా శాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. పోలీసు అధికారులు ఆలోచించాలి. ప్రజాస్వామ్య యుతంగా చేసే పోరాటాలపై అణచివేతకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
-
Mega Hero’s : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!