Love Jihad: లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ముంబైలో భారీ ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Jihad: లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ముంబైలో వేలాదిమంది రోడ్లపై భారీ ప్రదర్శన చేపట్టారు. ముస్లింలు హిందువుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, హిందూ యువతులను ప్రేమ పేరుతో తీసుకెళ్లి, మతం మార్చుతుండటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. అనేక హిందూ సంస్థలు, వాటి మద్దతుదారులు, సాధారణ ప్రజానీకం ఆదివారం ఉదయం శివాజీ పార్క్ వద్ద తమ నిరసన గళాన్ని వినిపించారు. వీరిలో బాలలు కూడా ఉన్నారు. సకల హిందూ సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మీనాతాయ్ థాకరే విగ్రహం నుంచి ప్రభాదేవి కామ్‌గార్ మైదానం వరకు ఈ ప్రదర్శన జరిగింది. లవ్ జీహాద్, ల్యాండ్ జీహాద్‌లకు వ్యతిరేక నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులను మేలుకొలిపే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు.
Read Also: Water Tax: భూమిలోని నీటిని తోడితే ట్యాక్స్ కట్టాల్సిందే.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
Also Read
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
హిందూ జన ఆక్రోశ్ మోర్చా పేరుతో ర్యాలీ చేపట్టారు. దాదర్‌లోని శివాజీ పార్క్ నుంచి పార్లేలోని కామ్‌గర్ మైదాన్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ప్రదర్శన జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఈ ర్యాలీ నిర్వహించారు. సీఎం ఏకనాథ్ షిండేతో పాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయని, మహారాష్ట్రలో కూడా అటువంటి చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కొందరు నిరసనకారులు మాట్లాడుతూ, హిందువులను వేధించి, చట్టవిరుద్ధంగా భూములను సొంతం చేసుకుంటున్నారన్నారు. అస్సాంను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో స్థానిక జనాభాలో వారి సంఖ్యాబలాన్ని పెంచుకోవడం కోసం భూములను లాక్కుంటున్నారన్నారు. మహారాష్ట్రలో కూడా చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న మసీదులు, ఇతర నిర్మాణాలు ల్యాండ్ జీహాద్‌కు సంకేతాలని తెలిపారు. దీనిపై తాము ప్రజలను మేలుకొలుపుతున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!