VHP warning on Christmas celebrations: క్రిస్మస్ వేడుకలపై హిందూ సంస్థ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ భోపాల్ లోని పాఠశాలలు విద్యార్థులు ఎవరూ కూడా శాంతాక్లాజ్ వేషధారణ ధరించేందుకు అనుమతించకూడదని హెచ్చరించింది. ఇదే విషయంపై భోపాల్ నగరంలోని అన్ని విద్యాలయాలకు వీహెచ్‌పీ లేఖలు రాసింది. సనాతన హిందూ మతం, సంస్కృతిని విశ్వసించే విద్యార్థులను క్రిస్మస్ చెట్లను తీసుకురావానలి.. శాంటాక్లాజ్ దుస్తులు ధరించాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించింది.
Read Also: Punjab Speaker Kultar Singh: కేసీఆర్, కేజ్రీవాల్ కలిస్తే రైతురాజ్యం
దీన్ని హిందూ సంస్కృతిపై దాడిగా అభివర్ణించింది వీహెచ్‌పీ. హిందూ పిల్లలపై క్రైస్తవ మతాన్ని రుద్దే కుట్ర జరుగుతోందని ఆరోపించింది. హిందూ పిల్లలను క్రిస్టియన్ మతంలోకి ప్రేరేపించే కుట్రగా.. ఇలాంటి డ్రెస్సులు, చెట్లను కొని తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారని వీహెచ్‌పీ ఆరోపించింది. హిందూ పిల్లలను క్రైస్తవ మతం వైపు ఆకర్షించేందుకు పాఠశాలలు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించింది. హిందూ పిల్లలు రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, గౌతమ్, మహావీర్, గురు గోవింద్ సింగ్ లుగా గొప్ప వ్యక్తులుగా మారాలి అని శాంతాక్లాజుల్లా మారకూడదు అని వీహెచ్‌పీ అంది. భారతదేశం సాధువుల దేశం అని.. శాంతాక్లాజుల దేశం కాదని పేర్కొంది. అలాంటి పాఠశాలలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ లో క్రిస్మస్ వేడుకలపై దాడి జరిగింది. బలవంతపు మతమార్పుడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ 30 మంది యువకులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన ఉత్తర కాశీ జిల్లా పురోలా గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.