Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- రిలయన్స్ జియో రూ.319, రూ.339 నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్స్..
- రెండు ప్లాన్లలోనూ ప్రతిరోజూ 1.5GB డేటా (మొత్తం 45GB), అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు
- 18 నెలల Google AI Pro సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా
- Google AI Proతో పాటు 5TB Google Cloud Storage ప్రయోజనం కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Recharge: ప్రస్తుతం దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా మారిన రిలయన్స్ జియో (Reliance Jio) నెలవారీ వ్యాలిడిటీతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో రూ.319, రూ.339 ప్లాన్లలో ప్రతిరోజూ 1.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు (గూగుల్ AI ప్రో) Google AI Pro సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది.
రూ.319 ప్లాన్:
జియో రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ లో ప్రతిరోజూ 1.5GB హై-స్పీడ్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో పాటు 18 నెలల పాటు గూగుల్ AI ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. దీని విలువ సుమారు రూ.35,100 కాగా.. ఇందులో 5TB (5000GB) గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా JioTV, JioAICloud వంటి సేవలకు కూడా యాక్సెస్ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా మాత్రమే ఉన్నందున అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం అందుబాటులో ఉండదు.
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
రూ.339 ప్లాన్:
రూ.339 ప్రీపెయిడ్ ప్లాన్ లో కూడా ప్రతిరోజూ 1.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, నెలవారీ వ్యాలిడిటీ అందుబాటులో ఉంటాయి. అలాగే 18 నెలల గూగుల్ AI ప్రో, జియోటీవీ, JioAICloud ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్‌కు రూ.319 ప్లాన్‌తో పోలిస్తే ప్రధాన తేడా రూ.14.95 టాక్‌టైమ్ అదనంగా లభించడం మాత్రమే. మిగతా అన్ని ప్రయోజనాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఈ ప్లాన్‌లో కూడా అన్లిమిటెడ్ 5G డేటా అందుబాటులో ఉండదు.
రోజువారీ 1.5GB డేటా సరిపడే వినియోగదారులు, ప్రతి నెల ఒకే తేదీన రీచార్జ్ చేసుకోవాలనుకునేవారికి ఈ రెండు ప్లాన్లు మంచి ఎంపికగా చెప్పవచ్చు. ముఖ్యంగా Google AI Pro వంటి ప్రీమియం సేవను ఉచితంగా పొందాలనుకునే వారికి ఈ ప్లాన్లు మరింత విలువను అందిస్తాయి.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి