8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
- Huawei Nova 16 SE స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా లాంచ్
- 6.84-అంగుళాల LTPS OLED డిస్ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్.
- Huawei స్వంత Kirin 8020 చిప్సెట్, HarmonyOS ఆపరేటింగ్ సిస్టమ్.
- 50MP AI రియర్ కెమెరాతో పాటు Red Maple కలర్ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరా.
- భారీ 8,500mAh బ్యాటరీ, 66W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei Nova 16 SE Launch: హువావే (Huawei) నోవా సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Nova 16 SEను చైనాలో లాంచ్ చేసింది. 8,500mAh బ్యాటరీ, 8,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన OLED డిస్ప్లే, 50MP AI కెమెరా, కొత్త Kirin 8020 చిప్సెట్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో బెస్ట్ ఆప్షన్.
OLED డిస్ప్లే:
Huawei Nova 16 SEలో 6.84 అంగుళాల LTPS OLED డిస్ప్లేను అందించారు. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్ మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్లో అత్యంత ప్రత్యేకమైన అంశం 8,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, దీంతో ఎండలో కూడా స్క్రీన్‌ను స్పష్టంగా కనిపిస్తుంది.
Also Read
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
50MP కెమెరా, AI ఫోటోగ్రఫీ ఫీచర్లు:
ఫోన్ వెనుక భాగంలో కొత్త డిజైన్‌తో కెమెరా మాడ్యూల్‌ను అందించారు. ఇందులో 50MP ప్రధాన కెమెరా (f/1.9 అపర్చర్)తో పాటు 1.5 మిలియన్ పిక్సెల్ రెడ్ మాపలే కలర్ సెన్సార్ ఉంది. కెమెరా 10x డిజిటల్ జూమ్ కు మద్దతు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా (f/2.2 అపర్చర్)ను అందించారు. ముందు, వెనుక కెమెరాల్లో AI ఆధారిత పలు ఫోటోగ్రఫీ మోడ్లు కూడా ఉన్నాయి.
Kirin 8020 చిప్:
Huawei Nova 16 SEలో కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన Kirin 8020 ప్రాసెసర్‌ను ఉపయోగించింది. రోజువారీ వినియోగం, మల్టీటాస్కింగ్, వీడియో స్ట్రీమింగ్, క్యాజువల్ గేమింగ్ వంటి పనులను సాఫీగా నిర్వహించేలా ఈ చిప్ రూపొందించబడింది. ఫోన్ HarmonyOSపై పనిచేస్తుంది.
బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8,500mAh భారీ బ్యాటరీని అందించారు. ఇప్పటివరకు విడుదలైన నోవా SE సిరీస్‌లో ఇదే అత్యధిక బ్యాటరీ సామర్థ్యం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటల తరబడి వీడియోలు చూడడం, గేమింగ్, సోషల్ మీడియా వినియోగం వంటి పనులను సులభంగా కొనసాగించవచ్చని కంపెనీ తెలిపింది. ఛార్జింగ్ కోసం 66W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ధర:
ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 12 నుంచి చైనాలో ఓపెన్ సేల్కు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను చైనా మార్కెట్‌కే పరిమితం చేసిన హువావే, ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. Huawei Nova 16 SE ధరలు చైనాలో ఈ విధంగా ఉన్నాయి..
* 128GB – 2,499 యువాన్
* 256GB – 2,699 యువాన్
* 512GB – 3,199 యువాన్

Huawei Nova 16 SE స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: 6.84-అంగుళాల LTPS OLED, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్
పీక్ బ్రైట్నెస్: 8,000 నిట్స్
ప్రాసెసర్: Kirin 8020
ఆపరేటింగ్ సిస్టమ్: HarmonyOS
రియర్ కెమెరా: 50MP మెయిన్ కెమెరా + Red Maple కలర్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 32MP
బ్యాటరీ: 8,500mAh
ఛార్జింగ్: 66W ఫాస్ట్ ఛార్జింగ్.
స్టోరేజ్: 128GB / 256GB / 512GB.
రంగులు: బ్లాక్, వైట్, బ్లూ, గ్రీన్.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..