Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bear Kills Siblings: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఆడ ఎలుగుబంటి తన పిల్ల చనిపోవడంతో తీవ్ర ఆవేదన, ఆగ్రహంలో ఇద్దరు అన్నాచెల్లెళ్లపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడగా.. ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ విషాద అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్హర్‌పూర్ అటవీ పరిధిలోని లర్‌గావ్–మర్కటోలా ప్రాంతంలో బుధవారం ఉదయం ఓ రైతు తన ఎద్దులను మేపేందుకు పొలానికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఆడ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. అతడు ఎలుగుబంటితో పోరాడుతుండగా అతని సోదరి అతడిని రక్షించేందుకు పరుగెత్తుకుని వచ్చింది. అయితే ఎలుగుబంటి ఆమెపై కూడా దాడి చేయడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
మరోవైపు గ్రామస్తుల కథనం ప్రకారం.. ఎలుగుబంటి పిల్ల ఒకటి మంగళవారం నాడు చనిపోయింది. ఆ పిల్ల మృతదేహం పక్కనే తల్లి ఎలుగుబంటి రాత్రంతా కాపలా కాసింది. ఆ తర్వాత అటవీ శాఖ సిబ్బంది పిల్ల మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించారు. దీంతో మరింత ఆందోళనకు గురైన ఆడ ఎలుగుబంటి తీవ్ర ఆగ్రహంతో వ్యవహరించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతం సమీపంలోనే ఓ పాఠశాల కూడా ఉండటంతో విద్యార్థులు, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఆశారామ్ నేతమ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే ఎలుగుబంటి మృతదేహాల వద్దే కూర్చొని వాటిని వదిలిపెట్టకుండా ఉండటంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు ప్రత్యేక బృందం ఎలుగుబంటికి మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకుంది. ఎలుగుబంటి స్పృహ కోల్పోయిన అనంతరం అటవీశాఖ సిబ్బంది దానిని తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు కర్రలు, దుడ్డుకర్రలతో స్పృహ తప్పిన ఎలుగుబంటిపై దాడికి దిగారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా గ్రామస్తులను అదుపు చేయడం కష్టమైంది. ఆ తర్వాత అధికారులు ఎలుగుబంటిని, మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు.
भाई – बहन को मार कर शव को नोचता रहा भालू ,
कैमरे में कैद हुआ दिल दहला देने वाला मंज़र
छत्तीसगढ़ के कांकेर जिले में भालू ने हमला कर भाई-बहन को मार डाला।
मारने के बाद उनके शवों को नोचता रहा,
घटना बुधवार दोपहर की है। हमले में 3 लोग गंभीर रूप से घायल हैं,
जिन्हें अस्पताल… pic.twitter.com/OgzDn8KmBw
— TANVIR RANGREZ (@virjust18) August 5, 2026
తీవ్రంగా గాయపడిన మహిళను మొదట స్థానిక ఆస్పత్రికి తరలించి, పరిస్థితి విషమంగా ఉండటంతో రాయ్‌పూర్‌కు రిఫర్ చేశారు. మరోవైపు మృతుల కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించింది. అవసరమైన ప్రక్రియ పూర్తయ్యాక మిగిలిన పరిహారం కూడా అందజేస్తామని అటవీశాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తెలిపారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!