West Bengal: ఆడ సింహానికి “సీత” పేరు.. కోర్టుకెక్కిన వీహెచ్‌పీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో రెండు సింహాలకు పెట్టిన పేర్లు వివాదాస్పదమయ్యాయి. త్రిపుర నుంచి బెంగాల్ సఫారీ పార్కుకు తీసుకువచ్చిన ఆడ సింహానికి ‘సీత’ అని పేరుపెట్టడంపై విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) హైకోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టులోని జల్పాయిగురి సర్క్యూట్ బెంచ్ హిందూ సంస్థ తరుపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆడ సింహానికి ఎలాంటి పేరు పెట్టలేదని పార్క్ అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు.
ఫిబ్రవరి 12న త్రిపురలోని సెపాహిజాలా జూలాజికల్ పార్క్ నుండి రెండు సింహాలను తీసుకొచ్చారు. ఆడ సింహానికి ‘సీత’ అని, మరో సింహానికి ‘అక్బర్’ అని పేరు పెట్టారని వీహెచ్‌పీ పేర్కొంది. ఫిబ్రవరి 16 వీహెచ్‌పీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఫిబ్రవరి 20న కోర్టు సింగిల్ బెంచ్ ముందు ఈ కేసు విచారణకు రావచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది శుభాంకర్ దత్తా తెలిపారు.
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
Read Also: Rahul Gandhi: రాహుల్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఎమర్జెన్సీగా వయనాడ్‌కు పయనం
జంతువుకు ఇలా పేర్లు పెట్టడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని, ఆడ సింహం పేరు మార్చాలని పిటిషన్ కోరారు. భవిష్యత్తులో ఏ జూలాజికల్ పార్క్‌లోని ఏ జంతువుకు ఏ మతానికి చెందిన దేవుళ్లు మరియు దేవతల పేర్లు పెట్టకూడదని కూడా కోరినట్లు దత్తా చెప్పారు. జంతువుల మార్పిడిలో భాగంగా బెంగాలీ సఫారీ పార్క్‌కి IL26 మరియు IL27 అనే రెండు సింహాలు వచ్చాయి, ఈ సింహాల్లో ఒకదానికి సీత అనే పేరు పెట్టారని, తాము మీడియా నివేదికల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు వీహెచ్‌పీ తెలిపింది. పార్క్ అధికారులు మాత్రం, తాము ఇంకా ఎలాంటి పేర్లు పెట్టలేదని చెప్పారు.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!