Pawan Kalyan: విశాఖ పర్యటనలో పోలీసుల ఆంక్షల కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్‌లోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 12 కుటుంబాలకు రూ.60 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారే. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో ఈ చెక్కులు అందజేయాల్సి ఉంది. అయితే సభలు, సమావేశానికి పోలీసులు…
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో విశాఖ ప్రధానమైన నగరం అని.. పర్యాటకులు ఎక్కువగా వెళ్లే నగరం అని.. ఇలాంటి ప్రశాంతమైన నగరాన్ని అలజడి నగరంగా తయారైన పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నారని.. రైతుల పాదయాత్ర పేరుతో విశాఖపై దాడి చేయించటానికి చంద్రబాబు ఓ వైపు ప్రయత్నం చేస్తున్నారని…
Vidadala Rajini: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మంత్రులపై జరిగిన దాడి ఘటనపై మంత్రి విడదల రజినీ స్పందించారు. జనసేన కార్యకర్తలు కావాలనే మంత్రులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని ఎన్టీవీతో చెప్పారు. ఒకవేళ తాము జనవాణిని అడ్డుకోవాలని భావిస్తే ఇప్పటివరకు నాలుగు జనవాణిలు జరిగి ఉండేవి కావన్నారు. నిన్న ఎయిర్ పోర్ట్ దగ్గర ట్రాఫిక్‌లో తాను ఇరవై నిమిషాలు ఇరుక్కుపోయానని.. జనసేన కార్యకర్తలు తన కారు చుట్టూ చేరి…
RK Roja: వైసీపీ మంత్రి రోజా సెల్వమణికి వైజాగ్ లో ఘోర అవమానం జరిగింది. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న ఆమెపై జన సైనికులు దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
Vishakapatnam Police: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఈ పర్యటనలో మంత్రులపై రాళ్ల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు విశాఖ సిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్‌లో మీడియా సమక్షంలో విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర ఆయనకు నోటీసులు అందజేశారు. విశాఖ నగరంలో పోలీస్ యాక్ట్, సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు…
Botsa Satyanarayana: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు వైసీపీ వికేంద్రీకరణ రాగం అందుకుందని టీడీపీ ఆరోపిస్తుంటే.. వికేంద్రీకరణ చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 15న ఉదయం 9 గంటల నుంచి విశాఖ…
Andhra Pradesh: మాములుగా పండగల సందర్భంగా గోదావరి ప్రాంత ప్రజలు తమ అల్లుళ్లకు చేసే రాచ మర్యాదలే వేరు. గోదావరోళ్ల మర్యాదల గురించి ఇప్పటికే చాలాసార్లు విన్నాం. సంక్రాంతి, దసరా వంటి పండగలకు తమ ఇంటికి వచ్చే కొత్త అల్లుడికి అదిరిపోయే రీతిలో అత్తింటి వారు విందులను ఏర్పాటు చేస్తుంటారు. ఆ విందులోని ఐటమ్స్ చూస్తే మనకు కూడా నోట్లో నోరూరుతుంది. అయితే తాజాగా విశాఖకు చెందిన ఓ కుటుంబం తమకు కాబోయే అల్లుడికి 125 రకాలతో…
Magadheera: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ కలెక్షన్స్ వస్తుండటం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల మహేష్‌బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా, చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలకు సంబంధించి స్పెషల్ షోలు ప్రదర్శించారు. తాజాగా బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమా స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే రెగ్యులర్ సినిమాగా చెన్నకేశవరెడ్డిని రోజుకు 4 ఆటలుగా ప్రదర్శిస్తూ వసూళ్లు దండుకుంటున్నారు. అంతేకాకుండా హాలీవుడ్…
Gudivada Amarnath: ఏపీ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో అసెంబ్లీలో ఈ అంశంపై బిల్లు కూడా పెడతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తమకు సవాళ్లు విసరడం దేనికి అని.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పగానే…