ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లతో బిజీ బిజీగా గడపనుంది. తొలుత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ పాల్గొననుంది. ఈనెల 9 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 ఢిల్లీలో, రెండో టీ20 కటక్‌లో, మూడో టీ20 విశాఖలో, నాలుగో టీ20 రాజ్‌కోట్‌లో, ఐదో టీ20 బెంగళూరులో జరగనున్నాయి. అయితే ఈనెల 14న విశాఖలో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు యమా క్రేజ్ ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ టిక్కెట్లను ఈరోజు ఉదయం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధికారులు అందుబాటులో ఉంచారు.
కరోనా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ కావడంతో ఆన్‌లైన్‌లో పెట్టిన 10 నిమిషాలకే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఉదయం 11:30 గంటలకు రూ.600, రూ.1500, రూ.2 వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.6వేలు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. 80 శాతం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచగా అన్నీ అమ్ముడైనట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధికారులు వెల్లడించారు. మిగతా 20 శాతం టిక్కెట్లను ఈనెల 8న ఆఫ్‌లైన్‌లో వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వద్ద మూడు కౌంటర్లలో విక్రయిస్తామని తెలిపారు. కాగాదాదాపు రెండున్నరేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు స్థానిక వైఎస్ఆర్-వీడీసీఏ స్టేడియం వేదికగా మారుతుండటంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.