Vishakapatnam: విశాఖపట్నం నగర శివారులోని గాజువాకలో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహానికి ముప్పు పొంచి ఉంది. 89 అడుగుల గణేష్ విగ్రహం కూలిపోతుందేమోనని స్థానిక పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ భారీ వినాయకుడి మట్టి విగ్రహం ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోయింది. దీంతో తనిఖీలు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను పోలీసులు కోరారు. తనిఖీ చేసిన ఆర్ అండ్ బీ అధికారులు ఈ భారీ విగ్రహం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని నివేదిక…
Plastic Ban: విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖలో శుక్రవారం నిర్వహించిన ‘సాగర తీర స్వచ్ఛత’ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర తీరంలో 20వేల మందితో 28కి.మీ. మేర బీచ్ క్లీనింగ్ చేపట్టి 76 టన్నుల ప్లాస్టిక్‌ను తొలగించామని తెలిపారు. అటు ఏపీలో ఈరోజు నుంచే ప్లాస్టిక్ బ్యానర్లు రద్దు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఇకపై క్లాత్ బ్యానర్లు మాత్రమే కనిపించాలని సూచించారు. విశాఖ…
Salman Khan in Vishakapatnam: బాలీవుడ్ కండల వీరుడు, సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ విశాఖలో సందడి చేశాడు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా విశాఖకు వచ్చిన హీరో సల్మాన్ ఖాన్.. షూటింగ్ విరామ సమయంలో నేవీ సిబ్బందితో కలిసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఇండియన్ నేవీ తూర్పు కమాండ్ స్థావరమైన విశాఖపట్నంలోని నేవీ సిబ్బందితో సల్మాన్ ఖాన్ డ్యాన్సులు వేశాడు. అనంతరం నేవీ సిబ్బందితో కలిసి కిచెన్‌లో వంట చేశాడు. అంతేకాకుండా…
CJI NV Ramana: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం నాడు విశాఖలో పర్యటించారు. విశాఖ వచ్చిన ఎన్వీ రమణకు అంకోసా హాలులో రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి) శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణను రావిశాస్త్రి కుటుంబీకులు ఘనంగా సత్కరించారు. రావిశాస్త్రికి నివాళులు అర్పించిన అనంతరం శతజయంతి సభలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. రావిశాస్త్రి కవిత్వం ముందు తన…
Bar Licenses bidding in online: బార్ లైసెన్సుల జారీకి ఏపీ ప్రభుత్వం డోర్లు ఓపెన్ చేయడంతో వ్యాపారులు ఎగబడ్డారు. తొలిసారి ఆన్‌లైన్ విధానంలో బిడ్డింగ్ నిర్వహిస్తుండగా భారీ స్పందన కనిపించింది. లైసెన్స్ ఫీజులు., లిక్కర్ సప్లయ్ రూపంలో ఖజానాకు వేల కోట్ల రుపాయలు జమ కానున్నాయి. అదే సమయంలో తొలిసారి ఆన్ లైన్ బిడ్డింగ్ నిర్వ హిస్తుండగా….లైసెన్సులు జారీలో పారదర్శకతకు అవకాశం కలిగింది. ఏపీ ఎక్సయిజ్ శాఖకు ఊహించని కిక్కు దొరికింది. నూతన బార్ లైసెన్స్…
Twist in saipriya missing case in vishakapatnam rk beach విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసులో ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు బంధువులు గుర్తించారని పోలీసులు తెలిపారు. ప్రియుడితో సాయిప్రియ వెళ్లిపోయినట్లు స్పష్టం చేశారు. నెల్లూరుకు చెందిన రవితో కొన్నాళ్లుగా సాయిప్రియ ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలిపారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో ఆర్కే బీచ్‌కు వెళ్లిన క్రమంలో భర్త మొబైల్ చూస్తున్న సమయంలో సాయిప్రియ లవర్‌తో…
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు సంబంధించి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీని విశాఖలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 14 నుంచి 31 వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరుల ఎంపికలు ఉంటాయని ప్రకటించారు. ఏపీలోని 13 జిల్లాలు, యానాం కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, పార్వతీపురం మన్యం,…
'ఈరోజుల్లో మనుషుల మధ్య అనుబంధాలు ఎలా ఉన్నాయి?' అనే ప్రశ్నకు సమాధానమిస్తూ సెల్‌ఫోన్లు రిలేషన్‌షిప్‌లను పాడుచేస్తున్నాయని, వ్యక్తుల విలువైన సమయాలను నాశనం చేస్తున్నాయని శకుంతలా పట్నాయక్ ఆవేదన వెలిబుచ్చారు.
దేశంలో బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడిన మహానుభావుల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఉంటారు. 1897 జూలై 4న విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు జన్మించారు. అయితే చిన్నతనంలోనే ఆధ్యాత్మికతకు ఆకర్షితుడు అయ్యి ఆయన చదువు మానేసి సన్యాసిగా మారి పశ్చిమగోదావరి జిల్లా అడవుల్లో నివసించేవారు. అడవుల్లో జీవనం సాగించే సమయంలోనే బ్రిటీష్ వారి అటవీ చట్టాల ద్వారా గిరిజనులపై జరుగుతున్న దాడులను అల్లూరి తన కళ్లారా చూశారు. దీంతో గిరిజనుల కష్టాలను తొలగించాలని ఏకంగా బ్రిటీష్ వారిపైనే సమరానికి…