రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. వాల్తేర్ డివిజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈనెల 6న సోమవారం నాడు విజయవాడ-విశాఖ మార్గంలో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దు చేసిన రైళ్లలో కాకినాడ పోర్ట్-విశాఖపట్నం (రైలు నంబర్ 17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు (రైలు నంబర్ 17268), విజయవాడ-కాకినాడ పోర్టు (రైలు నంబర్ 17257), కాకినాడ పోర్టు-విజయవాడ (రైలు నంబర్ 17258), విజయవాడ-రాజమండ్రి (రైలు నంబర్ 07768), రాజమండ్రి-విజయవాడ (రైలు నంబర్ 07767) ఉన్నాయి.
