RK Roja: వైసీపీ మంత్రి రోజా సెల్వమణికి వైజాగ్ లో ఘోర అవమానం జరిగింది. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న ఆమెపై జన సైనికులు దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల రోజా, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి మూడు రాజధానులు గురించి విమర్శలు చేసిన విషయమే. పవన్ కళ్యాణ్ కు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి.. షూటింగ్ చేసుకోవడానికి వైజాగ్ కావాలి.. ఆయన సినిమా కలెక్షన్స్ కోసం వైజాగ్ కావాలి. ఆయన నటన నేర్చుకోవడానికి, పోటీ చేయడానికి వైజాగ్ కావాలి.. కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడతాము అంటే మాత్రం అడ్డుపడుతున్నాడు.
గాజువాక లో పవన్ కళ్యాణ్ ను చిత్తుగా ఓడించి బుద్దిచెప్పారు మీరు చాలా తెలివైన వారు అని విమర్శించింది. ఇక ఈ వ్యాఖ్యలపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ నేతలపై జన సైనికులురాళ్లు విసిరారు. కార్ల అద్దాలను పగుల కొట్టారు. ఈ ఘటనలో రోజా కారు కూడా ఉందని, ఆమెకు దెబ్బలు కూడా తగిలినట్లు సమాచారం. ఇక ఈ దాడిపై రోజా స్పందిస్తూ విశాఖ గర్జనకు వచ్చిన స్పందన తట్టుకోలేకే జన సైనికులు మంత్రులపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తుందని, ఒకరిపై చెప్పులు విసిరారని, మరొకరి కారు అద్దాలు పగులకొట్టారని చెప్పిన రోజా ఈ ఘటనతో రౌడీయిజం ఎవరు చేస్తున్నారో ప్రజలకు అర్ధమయ్యిందని తెలిపారు.