Royal Challengers Bangalore Scored 65 Runs In First 10 Overs: లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచి రంగంలోకి దిగిన ఆర్సీబీ బ్యాటింగ్ నత్తనడకన సాగుతుంది. తొలి 10 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ ఒక వికెట్ నష్టానికి కేవలం 65 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్ తమఇన్నింగ్స్ నిదానంగా ఆడటం వల్లే.. ఆర్సీబీ స్కోరు నిదానంగా ముందుకు సాగుతోంది. తొలి పది ఓవర్లలో కేవలం నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే నమోదయ్యాయంటే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.

Rohit Sharma: రోహిత్ శర్మ ఔటా? నాటౌటా? ఇదిగో సాక్ష్యం!
నిజానికి.. తొలి బంతికే విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టడం చూసి, ఈరోజు అతడు ఊచకోత కోయం ఖాయమని అందరూ అనుకున్నారు. ఇందకుముందు ఈ జట్టు చేతిలో ఘోర పరాజయం చవిచూశారు కాబట్టి, అందుకు ప్రతీకారంగా ఈ మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగిపోతాడని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా అతడు నిదానంగా ఆడాడు. చాలా బంతులు వృధా చేశాడు. 30 బంతులు ఆడిన కోహ్లీ మూడు ఫోర్ల సహకారంతో 31 పరుగులే చేశాడంటే.. అతను ఏ విధంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. అతనితో పాటు డు ప్లెసిస్ కూడా ఈ మ్యాచ్‌లో చాలా స్లోగా రాణించాడు. గత మ్యాచ్‌లో విజృంభించి ఆడిన అతగాడు.. ఈసారి ఏమైందో ఏమో తెలీదు కానీ, ఒకట్రెండు పరుగులతోనే సర్దుబాటు చేసుకుంటున్నాడు.
Nabha Natesh: అమ్మడి ఒంటి సొగసుపై చున్నీ నిలవంటుందే
అసలు వీళ్లిద్దరు పవర్ ప్లే సమయంలో ఉంటే.. పరుగుల వర్షం కురిపించేస్తారు. అలాంటిది.. పవర్ ప్లేని ఏమాత్రం వినియోగించుకోలేదు. పోనీ.. ఆ తర్వాత అయినా చెలరేగిపోతారనుకుంటే, అదీ లేదు. టెస్ట్ ఇన్నింగ్స్ ఆడినట్టు.. మరీ నిదానంగా ఆడి, తీవ్రంగా డిజప్పాయింట్ చేశారు. ఇక కోహ్లీ అయితే మరీ సిల్లీగా ఔటయ్యాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో ముందుకొచ్చి భారీ షాట్ కొట్టాలని ట్రై చేశాడు కానీ, బంతి అతడ్ని దాటి కీపర్ చేతికి వెళ్లిపోయింది. ఇక కీపర్ ఊరికే ఉంటాడా? స్టంట్ ఔట్ చేసి, కోహ్లీని పెవిలియన్ పంపించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని భావిస్తే, కోహ్లీ ఇలా ఉసూరుమనిపిస్తాడని అనుకోలేదు.