Royal Challengers Bangalore Won The Toss And Chose To Bat Against LSG: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆర్సీబీ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఆల్రెడీ ఈ రెండు జట్లు ఏప్రిల్ 10వ తేదీన తలపడ్డాయి. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో.. లక్నో గెలుపొందింది. ఆర్సీబీ నిర్దేశించిన 213 లక్ష్యాన్ని ఛేధించి, లక్నో ఘనవిజయం సాధించింది. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈసారి లక్నో జట్టుకి గట్టి సమాధానం ఇవ్వాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు.. లక్నో జట్టు మరోసారి తన సత్తా చాటి, ఆర్సీబీపై గెలుపొందాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Mark Cuban: ఎలాన్ మస్క్‌కి ఫిట్టింగ్.. రోజుకి 1000 ఫాలోవర్లు పోతున్నారంటూ ఫిర్యాదు
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 8 మ్యాచ్‌లు ఆడిన లక్నో జట్టు.. 5 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కానీ.. ఆర్సీబీ మాత్రం 4 విజయాలతో 6వ స్థానంలో ఉంది. లక్నో జట్టుకి ఉన్న అనుకూలమైన విషయం ఏమిటంటే.. ఆరు వికెట్ల దాకా మంచి బ్యాటర్లు ఉన్నారు. టాపార్డర్ ఫెయిలయినా, మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. కైల్ మేయర్స్, మార్కస్, పూరన్ వంటి విధ్వంసకర బ్యాటర్లున్నారు. వీళ్లలో ఏ ఒక్కరు నిలకడగా రాణించినా.. మైదానంలో బౌండరీల వర్షం కురవడం ఖాయం. కానీ.. ఆర్సీబీ జట్టు అలా కాదు. టాపార్డర్ మీద ఆధారపడి ఉంది. ఆడితే.. విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ మాత్రమే ఆడాలి. ఒకవేళ ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు విఫలమైనా.. జట్టు ప్రమాదంలో పడినట్టే. గతేడాది ఫినిషర్‌గా అద్భుతంగా రాణించినా దినేశ్ కార్తిక్.. ఈ సీజన్‌లో మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాపరుస్తున్నారు. ఇక ఇతర బ్యాటర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతే బెటర్. మరి.. ఈ ఇరు జట్ల మధ్య పోరు ఎలా సాగుతుందో చూడాలి.
Extramarital Affair: వివాహేతర సంబంధం.. పక్కా స్కెచ్ వేసి భార్య రివేంజ్