Royal Challengers Bangalore Won The Match By 18 Runs Against LSG: లక్నో సూపర్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ప్రతీకారం తీర్చుకుంది. ఏప్రిల్ 10వ తేదీన హోమ్‌గ్రౌండ్‌లో (బెంగళూరు) తమని ఓడించిన ఆ జట్టుని.. ఇప్పుడు వాళ్ల హోమ్‌గ్రౌండ్‌లో వారిని మట్టికరిపించింది. లక్నోకి నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ డిఫెండ్ చేసింది. 108 పరుగులకే లక్నో జట్టుని కట్టడి చేసింది. దీంతో.. 18 పరుగుల తేడాతో ఆర్సీబీ సూపర్ విక్టరీ సాధించింది. ఎప్పుడూ ధారాళంగా పరుగులు సమర్పించుకునే ఆర్సీబీ బౌలర్లు.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సత్తా చాటుకొని, తమ జట్టుని గ్రాండ్‌గా గెలిపించుకున్నారు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది.
Honey Rose: ఎలిజిబెత్ యువరాణి మళ్లీ పుట్టిందా అన్నట్టు ఉందే
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (31), డు ప్లెసిస్ (44) కాస్త మెరుగ్గా రాణించడంతో.. ఆర్సీబీ అంత మాత్రం స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లందరూ పూర్తిగా విఫలమయ్యారు. కాస్తోకూస్తో దినేశ్ కార్తిక్ (16) పర్వాలేదనిపించాడు. ఇక 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 108 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నిజానికి.. లక్ష్యం చాలా చిన్నదే కావడంతో, లక్నో జట్టు ఆడుతూ పాడుతూ ఛేధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. ఆర్సీబీ బౌలర్లు ఆ అంచనాల్ని బోల్తా కొట్టించేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి.. వరుసగా వికెట్లు తీయడం ప్రారంభించారు. కైల్ మేయర్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ని ఔట్ మొదట్లోనే ఔట్ చేయడంతో, లక్నో జట్టుకి బిగ్ జోల్ట్ తగిలినట్టయ్యింది. అతని తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా కాస్త జోష్‌గా ఆడటంతో, లక్నో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కానీ.. ఆ జోష్‌లోనే అతడు క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరాడు.
Off The Record: కర్ణాటక ఎన్నికలపైనే తెలంగాణ బీజేపీ నేతల ఆశలు..!
ఇంపాక్ట్ ప్లేయర్ ఆయుష్ బదోని ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. దీపక్ హుడా (1) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. స్టోయినిస్(13), పూరన్(9) లాంటి స్టార్ ఆటగాళ్లు సైతం చేతులెత్తేశారు. కృష్ణప్ప గౌతమ్ (13 బంతుల్లో 23) ఒక్కడే కాసేపు టఫ్ కాంపిటీష్ ఇచ్చాడు. అతడు కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ.. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. బహుశా అతడు ఇంకాసేపు క్రీజులో ఉండుంటే.. ఫలితం మరోలా ఉండేదేమో! నవీన్ ఉల్ హక్ కూడా చివర్లో ఆర్సీబీకి షాకిచ్చాడు. అప్పటివరకు నిదానంగా ఆడిన అతడు.. ఒక్కసారిగా ఊపందుకున్నాడు. రెండు ఫోర్లు కొట్టాడు. కానీ, ఇంతలోనే అతడు కూడా ఔట్ అయ్యాడు. చివర్లో వచ్చిన కేఎల్ రాహుల్.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మలుపు తిప్పుతాడేమోనని ఆశించారు కానీ, గాయం కారణంగా అతడు ఆడలేకపోయాడు. పైగా.. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది కూడా! చివర్లో వికెట్ కోల్పోకూడదని అనుకున్నారు కానీ, అమిత్ మిశ్రా బంతిని పైకి లేపడంతో ఔట్ అయ్యాడు. దీంతో.. లక్నో ఆలౌట్ అయ్యింది.