టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్( 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగుుల ) బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్‌ను మోత మోగించాడు. 49 బంతుల్లో ఐపీఎల్‌లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు. సన్ రైజర్స్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్( 27నాటౌట్; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అభిషేక్ శర్మ(11), రాహుల్ త్రిపాఠి(15), మార్క్రమ్(18)లు మరోసారి విఫలం అయ్యారు. బెంగళూరు బౌలర్లలో బ్రేస్‌వెల్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, షాబాద్ అహ్మద్, హర్షల్ పటేల్‌లు తల ఒక్కో వికెట్ తీసుకున్నారు.
Also Read : Chandrayaan 3: జూలై రెండో వారంలో చంద్రయాన్-3 ప్రయోగించే అవకాశం..
ఇక లక్ష్య ఛేదనలో బెంగళూరు ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. పవర్ ప్లేలోని 4.5 ఓవర్లలోనే ఆర్సీబీ 50 పరుగుల మార్క్ ను ధాటింది. ఇక పవర్ ప్లే ముగిసే సమయానికి బెంగళూరు స్కోరు 64/0గా ఉంది. విరాట్ కోహ్లీ-డుప్లెసిస్ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నారు. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడుతున్నా విరాట్ కోహ్లీ-డుప్లెసిస్ లు సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక పది ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసింది.
Also Read : Carys: పాప భలేగుందిరో… అంటున్న సినీజనం!
రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్లు విరాట్ కోహ్లీ ( 35 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగుల నాటౌట్ ), ఫాప్ డుప్లెసిస్ ( 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 51 పరుగుల నాటౌట్ ) ఇద్దరి జోడీ అద్భుతమైన వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పోరు. దీంతో ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది.