Rajasthan Royals Player Yashasvi Jaiswal Reveals His Sucess Secret In IPL: ఈ ఐపీఎల్ సీజన్‌లో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ అద్భుత ఫామ్‌లో దూకెళ్తున్నాడు. ఇప్పటివరకూ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన ఇతగాడు.. గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. 13 బంతుల్లోనే అర్థశతకం చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్థశతకాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 47 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. 98 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతనిపై తారాస్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రీడాభిమానులతో పాటు మాజీలు సైతం అతనికి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జైస్వాల్.. తన సక్సెస్ సీక్రెట్ పంచుకున్నాడు. ఆటతీరు మెరుగుపరుచుకునేందుకు.. విరాట కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీలాంటి దిగ్గజాలే కారణమని తెలిపాడు.
Suyash Sharma: సుయాశ్ చర్యకు మండిపడ్డ ఫ్యాన్స్.. నెట్టింట్లో ఏకిపారేశారుగా!
యశస్వీ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘నా చుట్టూ ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లున్నారు. నాకు అవకాశం దొరికినప్పుడల్లా.. ధోనీ, విరాట్, రోహిత్‌లతో పాటు సంజూ శాంసన్, జోస్ బట్లర్‌ల నుంచి నేర్చుకుంటాను. నా మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి.. ఎలా ఆలోచించాలి అనే విషయాల గురించి వారితో చర్చిస్తాను. నేనెప్పుడూ నేర్చుకోవడానికే ప్రయత్నిస్తా. ఎక్కడ మెరుగుపర్చుకోవాలో అక్కడ మెరుగవుతాను. ఎలా కంట్రోల్‌లో ఉండాలో నేర్చుకుంటాను. ఈ క్రికెట్ ఆట భౌతికం కంటే పూర్తిగా మనసుకు సంబంధించింది. ఆ జోన్‌లో ఉండేందుకు మనమెప్పుడూ ప్రయత్నించాలి’’ అంటూ వివరించాడు. కాగా.. 2019లో దేశవాళీ క్రికెట్‌లో జైస్వాల్ డబుల్ సెంచరీ చేసి, అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత 2020లో ఆర్ఆర్ యాజమాన్యం అతడ్ని బేస్‌ప్రైజ్ కంటే 12 రెట్లు అధికంగా వెచ్చించి సొంతం చేసుకుంది. మొదటి మూడు సీజన్స్‌లో పెద్దగా రాణించలేదు కానీ, ఈ సీజన్‌లో మాత్రం అతడు దుమ్ముదులిపేస్తున్నాడు.
Rohit Sharma: మా కెప్టెన్ అందుకే పరుగులు చేయట్లేదు.. ఇషాన్ సెటైరికల్ జవాబు