ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా మ్యాచ్ నెంబర్ 65లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ లో తప్పని సరిగా విజయం సాధించాల్సిందే.
Also Read : Karnataka CM swearing: కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారం.. కేసీఆర్, మమతాతో సహా గెస్ట్ లిస్ట్ ఇదే..
టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. మొదటి ఓవర్‌కు మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఓవర్ కుసన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్కోరు 2/0. మైకేల్ బ్రేస్‌వెల్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేశాడు. ఐదో ఓవర్ వేసిన బ్రేస్ వెల్ మొదటి బంతికి అభిషేక్ శర్మ(11)ను పెవిలియన్ కు పంపించగా.. మూడో బంతికి రాహుల్ త్రిపాఠి(15)ని డగౌట్ కి పంపించాడు. అభిషేక్ శర్మ క్యాచ్ ను మహిపాల్ లోమ్రోర్ అందుకోగా, త్రిపాఠి.. హర్షల్ పటేల్ చేతికి చిక్కాడు. దీంతో 28 పరుగులకే సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయింది.
Also Read : NTR30: టైటిల్ కన్నా క్యాప్షన్స్ తోనే భయపెడుతున్నారు కదయ్యా
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు క్లాసెస్, కెప్టెన్ మార్ర్కమ్ క్రీజులో కొనసాగుతున్నారు. హెన్రీచ్ క్లాసెన్ కేవలం 20 బంతుల్లోనే 40 పరుగులు చేస్తు మరోసారి సన్ రైజర్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక హైదరాబాద్ జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఎస్ ఆర్ హెచ్ సారథి మార్క్రమ్, హెన్రీచ్ క్లాసెన్ ఉన్నారు.
