ఇటీవలి కాలంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టుల్లో విఫలమవుతున్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో కోహ్లీ, రోహిత్‌లపై పలువురు టీమిండియా మాజీలు, అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీమ్ నుంచి తప్పుకుని యువకులకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వీరికి మద్దతుగా నిలిచారు. కోహ్లీ, రోహిత్‌లపై విమర్శలు సరికావని.. గతంలో వారు ఏం సాధించారో ఫాన్స్…
ధోనీని రీప్లేస్ చేయడం చాలా కష్టం.. ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నాను అని తెలిపాడు. ఇక, ధోనీ ఈ దేశానికి హీరో.. వ్యక్తిగతంగా, క్రికెటర్‌గా ఆయన నుంచి ఎన్నో అంశాలను నేర్చుకున్నాను.. మిస్టర్ కూల్ ఉన్నాడంటే.. జట్టులో ఎంతో నమ్మకం పెరుగుతుందని రిషభ్ పంత్ వెల్లడించారు.
ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసేటప్పుడే కాస్త ఇబ్బందిగా అనిపించింది.. వెన్ను నొప్పిపై వైద్య బృందంతో చర్చించాను అని టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ బుమ్రా తెలిపాడు. జట్టులోని సహచరులు బాధ్యత తీసుకునేందుకు ముందుకు రావడంతో.. ఒక బౌలర్ తక్కువైనప్పటికీ ఆసీస్‌ను కట్టడి చేయగలిగాం అన్నారు.
Gautam Gambhir: సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేరుగా మీడియా సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జట్టులో సీనియర్ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్‌పై కీలక కామెంట్స్ చేశాడు.
జట్టును విరాట్ కోహ్లీ నడిపిస్తున్నాడు. అయినా, సరే ఆసీస్ అభిమానులు అరుస్తూనే ఉండటంతో.. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత విరాట్ తన జేబులో రెండు చేతులు పెట్టి ‘నా దగ్గర ఏమీ లేదు చూసుకోండి’ అన్నట్లు వారికి సైగలు చేశాడు.
IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ, చివరి టెస్ట్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులకు ఆలౌటైంది. ఇక moiరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కూడా 9 పరుగులకే 1 వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజాను టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ కు పంపించాడు. ఉస్మాన్ ఖవాజా వికెట్‌కు ముందు..…
Gautam Gambhir: టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ మినహా న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై, ఇప్పుడు ఆస్ట్రేలియాలో పరాభవాలతో భారత జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో టీమ్ ను గాడిన పెట్టేందుకు కోచ్ గంభీర్ కఠినంగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది.
Virat Kohli: మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా ఫెయిల్ కావడంతో ఆర్సీబీ మాజీ కోచ్, ఆసీస్ మాజీ ప్లేయర్ సైమన్ కటిచ్ తీవ్ర విమర్శలు చేశారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారీ లక్ష్యం ముందున్నా చివరి వరకు పోరాడాలని నిశ్చయించుకున్నాం.. కానీ, ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయామన్నారు. ఏదేమైనా ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా ఆడి.. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుండటంతో.. #HappyRetirement అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.