అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఆరంభం అయింది. ఈ వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ వరుసగా పదో సారి టాస్ ఓడిపోయింది. ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడు మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వగా.. వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ ఎంట్రీ ఇచ్చారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (1) ఔట్ అయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో (1.1) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజ్‌లోకి విరాట్ కోహ్లీ (5), శుభ్‌మన్ గిల్ (9) ఉన్నారు. భారత్ 5 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 23 రన్స్ చేసింది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్, సకిబ్ మహమూద్.