కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా బయటపడలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు తిరిగి తెరుచుకోవడంతో టూరిస్టుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైని ముస్సోరిలోని కెంప్టీ జలపాతాన్ని సందర్శించేందుకు భారీగా తరలి వచ్చారు. కెంప్టీ జలపాతం కింద పర్యాటకు పోటీలుపడి మరీ స్నానాలు చేశారు. …
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా జనసంచారం తక్కువగా ఉండటంతో పాటుగా, కాలుష్యం కొంతమేర తగ్గిపోవడంతో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారుల వెంట ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. Read: ట్రెండింగ్ లో రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం…
అమెరికాలోని లాస్ ఎంజెలిస్‌లో ఓ వ్యక్తి అర్ధరాత్రి అలజడి సృష్టించాడు. దాదాపుగా నగ్నంగా ఉన్న ఓ వ్యక్తి బోయిల్ హైట్ ఏరియాలోని సెయింట్ మేరీ క్యాథలిక్ చర్చిపైకి ఎక్కి శిలువకు నిప్పు అంటించాడు. ఆ తరువాత అక్కడి నుంచి మరో బిల్డింగ్‌పైకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చర్చి శిలువకు నిప్పు అంటించినప్పటికీ ఆ మంటలు పెద్దగా అంటుకొకపోవడంతో అంతా ఊపిరి…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో పర్యాటక రంగం ఊపందుకుంది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు పోటెత్తున్నారు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా, విధిగా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడే ప్రాంతాల్లో మాస్క్ తీయకూడదని ప్రభుత్వాలు మోరపెట్టుకుంటున్నాయి. అయినా, ప్రజలు షరామామూలుగా మారిపోయారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. తిరిగి అదే నిర్లక్ష్యం ప్రజల్లో కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు నిత్యం టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తుంటారు. కరోనా…
మేకలు ఆకులు మాత్రమే తింటాయి అన్నది పాత మాట. ఈ మేక వెరీ స్పెషల్. ఇది ఆకులనే కాకుండా చేపలను కూడా లాగించేస్తోంది. ప్లేటులో ఉంచిన చేపలను కరకర నమిలి మింగేసింది. ఆకులు తినితిని బోర్ కొట్టిందేమో ఇలా చేపలను తింటోంది ఆ మేక. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఒక్కసారిగా వైరల్ అయింది. ఆకులు అలమలు తినే మేకలోనే అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటే, చేపలను తినే మేకలో ఇంకెన్ని…
పువ్వులు అన్నీ అందంగా ఉంటాయి. అందంగా ఉన్నయాని వాటిని ముట్టుకున్నా, వాసనచూసినా కొన్ని ఎఫెక్ట్ చూపుతుంటాయి. అలాంటి వాటిల్లో ఏంజిల్స్ ట్రంపెట్స్ ఒకటి. చూడటానికి పసుపురంగులో, పొడవుగా ఉమ్మెత్త పువ్వుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే, వీటిల్లో స్కోపోలమైన్ అనే భయంకరమైన, ప్రమాదకరమైన డ్రగ్ ఉంటుంది. వీటిని ముట్టుకున్నా, వాసన చూసినా ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. కెనడాలో ఎక్కువగా ఈ పువ్వులు కనిపిస్తుంటాయి. Read: దెయ్యంలా మారి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసిన హీరోయిన్…! టోరంటోకు చెందిన…
ఏదైనా సరే ఒక్కడితోనే మొదలౌతుంది. అతని మార్గాన్ని వేలాది మంది ఫాలో అవుతుంటారు. కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఉద్యోగ, ఉపాది అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలు చేసిన సమయంలో సంపాదించిన మొత్తంతోనే రెండేళ్లుగా ప్రజలు నెట్టుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనాకేసులు తగ్గతుండటంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, పూర్తిస్థాయిలో రవాణా వ్యవస్థ తెరుచుకోలేదు. కేవలం కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. ముఖ్యంగా ముంబై వంటి మహానగరాల్లో సామాన్యులు ప్రయాణం చేసే మెట్రో రైళ్లు తెరుచుకున్నా, ప్రభుత్వ ఉద్యోగులకు, అత్యవసరంగా…
కరోనా తగ్గుముఖం పడుతుండటంతో పెళ్లిళ్లు అధికంగా జరుగుతున్నాయి. పెళ్లిళ్లు అంటే హడావుడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సందడితో పాటుగా కొంత ఫన్ కూడా ఉంటుంది. కొంతమంది కావాలని వరుడు లేదా వధువును ఆట పట్టిస్తుంటారు. ఇలానే, ఓ పెళ్లిలో వరుడు పక్కన ఉండగానే ఓ యువకుడు వధువుకు ముద్దులు పెట్టాడు. పక్కనే ఉన్న వరుడు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అయితే, ఈ…
ఎవరో ఓ అధికారి గ్రామంంలోకి వచ్చి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయి, గ్రామస్తులు ఎలా ఉన్నారు అని పరిశీలించినట్టుగా ఓ మొసలి గ్రామంలోకి వచ్చి వీధులన్నీ తిరుగుతూ పరిశీలించింది. గ్రామంలోకి మొసలి రావడంతో గ్రామస్తులు పరుగులు తీశారు. మొసలి మాత్రం దర్జాగా తిరుగుతూ చుట్టూ పరిశీస్తూ వెళ్లింది. భయపడిన గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులు వచ్చి మొసలిని పట్టుకొని నదిలో వదిలేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని కోగిల్బాన్…
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. నాలుగు నెలల క్రితం లావుగా కనిపించిన కిమ్ నాలుగు నెలల తరువాత స్లిమ్‌గా మారిపోయాడు. రోజు రోజుకు ఆయన బరువు తగ్గుతుండటంతో కొరియన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండాలంటే ఫిట్ గా ఉండాలని నిపుణులు హెచ్చరించడంతో కిమ్ తన ఆరోగ్యంపైనా, బరువు తగ్గడంపైనా దృష్టిసారించారని అంటున్నారు. అయితే, సామన్యప్రజలు మాత్రం కిమ్ కు ఏదో ఆయిందని,…