పామును చూస్తే మనం ఆమడదూరం పరుగులు తీస్తాం. అందులో విషం ఉన్నదా లేదా అన్నది అనవసరం. పాము అంటే విషసర్పం అనే భావన మనందరిలో ఉన్నది. అయితే, కొందరు పాములను అవలీలగా పట్టుకొని వాటితో ఆడుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి వాటి యెడల ఉన్న మక్కువే కారణం అని చెప్పొచ్చు. పాముల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో రెయిన్‌బో స్నేక్ చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఈ రెయిన్‌బో స్నేక్ చూడటానికి బ్లూకలర్‌లో కనిపిస్తుంది. లైట్ దానిపై పడే కొలదీ…
ప్రపంచంలో ఎక్కువమంది సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. సముద్రంలో దొరికే చేపలను పట్టుకొని జీవిస్తుంటారు. అయితే, ప్రతిరోజూ సముద్రంలో అద్భుతాలు జరుగుతాయని అనుకోకూడదు. ఒక్కోసారి అదృష్టం అలా కలిసి వస్తుంది. నిత్యం సముద్రంలో చేపలు పట్టుకొని జీవించే ఓ మత్స్యకారుడి వలకు ఓ పెద్ద చేప దొరికింది. ఆ చేపను పడవలోని బల్లపై ఉంచి కత్తిలో కోశాడు. చేప కడుపులో చేయిపెట్టి శుభ్రం చేస్తుండగా అతడికి ఓ బాటిల్ దొరికింది. దాన్ని చూసి మత్స్యకారుడు షాక్ అయ్యాడు.…
మెట్రో రైల్లో అప్పుడప్పుడు మనుషులతో పాటుగా జంతువులు కూడా ప్రయాణం చేస్తుంటాయి. అనుకోని అతిధుల్లా రైల్లోకి వచ్చి, బోగీలన్ని విజిటింగ్ చేస్తు స్టేషన్ రాగానే దిగిపోతుంటాయి. ఇలాంటి ఘటనలు మనదగ్గర చాలా రేర్‌గా జరిగినా, హాంకాంగ్ మెట్రో రైల్లో ఇవి సాధారణమే. హాంకాంగ్‌లోని క్వారీబే మెట్రోస్టేషన్‌లోకి సమీపంలోని అడవిలోనుంచి ఓ అడవి పంది వచ్చింది. టక్కెట్ కౌంటర్ సందులో నుంచి లోనికి ప్రవేశించిన ఆ అడవి పంది రైలు ఎక్కేసింది. బోగీలన్నీ దర్జాగా తిరిగింది. ఓ సీటు…
పాము..ముంగీస బద్ద శతృవులు. పాము కనిపిస్తే ముంగీస దాన్ని చంపే వరకు ముంగీస ఊరుకోదు. రెండు ఒకదానికొకటి ఎదురుపడితే పెద్ద యుద్దమే జరుగుతుంది. పాము ముంగీస ఫైట్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. మహారాష్ట్ర జిల్లాలోని బుల్దాన్ జిల్లాలో రోడ్డుమీద పాము, ముంగీసలు ఎదురుపడ్డాయి. నువ్వానేనా అన్నట్టుగా ఫైట్ చేసుకున్నాయి. దాదాపుగా ఏడు నిమిషాలపాటు ఈ ఫైట్ జరిగింది. ముంగీస చేతిలో చావుదెబ్బలు తిన్న పాము అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా సరే ముంగీస మాత్రం…
కరోనా కాలంలో మనిషి సాటి మనిషిని పట్టించుకోవడం మర్చిపోయాడు. తను ఉంటే చాలు అనుకుంటున్నాడు. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు చేసిన సాహసం అందరిచేత చప్పట్లు కొట్టించింది. ఓ ప్రాణికి ప్రాణం పోసింది. ఇంతకీ ఆ యువకుడు చేసిన సాహసం ఏంటో తెలుసా…. ఊపిరి ఆడక అపస్మారక స్థితిలో ఉన్న ప్రాణికి ఊపిరి అందివ్వడమే. అందులో స్పెషల్ ఏముంది అనుకుంటే పొరపాటే. Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం : వారికి…
కాపలాగా ఉండాల్సిన ఓ శునకం యజమానికి తిప్పలు తెచ్చిపెట్టింది. యజమానే శునకానికి కాపలాగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాలోని కారటిగి పట్టణానికి చెందిన దిలీప్ అనే వ్యక్తి ఇంటికి కాపలాగా ఉంటుందని చెప్పి 5వేలు పెట్టి ఓ శునకాన్ని తెచ్చుకున్నాడు. అయితే, ఆ శునకం ఏకంగా యజమాని బంగారం గొలుసును మింగేసింది. గొలుసు కనిపించకపోవడంతో దిలీప్ ఇళ్లంతా వెతికాడు. చివరకు కుక్కను కట్టేసిన ప్రాంతంలో చిన్నచిన్న బంగారం ముక్కలు కనిపించడంతో షాక్ అయ్యాడు. తరువాత…
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పుకున్నారు. అంతేకాదు, పెళ్లి ఘనంగా చేస్తాం, పెళ్లికోసం 40వేల డాలర్లు ఖర్చుపెడతామని హామీ ఇచ్చారు. దీంతో పెళ్లికూతురు దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుంది. బడ్జెట్ వేసుకుంది. అయితే, చివరకు తల్లి వచ్చి బడ్జెన్ ను 20 వేలకు తగ్గించడంతో యువతి తల్లిదండ్రులపై అగ్గిమీద గుగ్గిలం అయింది. పెళ్లికి కనీసం 25వేల డాలర్లు ఖర్చు చేయాలని లేదంటే ప్రేమించిన యువకుడితో లేచిపోతానని బెదిరించింది. తల్లిదండ్రులే 40వేల డాలర్లు ఖర్చు…
గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా వంద రూపాయలుకు చేరింది. దీంతో సామాన్యులు పెట్రోల్ కొనుగోలు చేయాలంటే ఆలొచిస్తున్నారు. పెట్రోల్ ధరలకు భయపడి బయటకు రావడమే మానేశారు. పెట్రోల్ ధరలకు భయపడిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి 10 వేల రూపాయలు ఖర్చుచేసి జట్కాబండిని తయారు చేసుకున్నాడు. స్వతహాగా అతను రజకుడు కావడంతో నిత్యం దుస్తులను సేకరించేందుకు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తున్నది. దీంతో రజకుడు…
చాలా మంది లావుగా ఉన్నామని ఆంధోళన చెందుతుంటారు. బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు, ఆత్మన్యూనతను పోగొట్టేందుకు జపాన్‌కు చెందిన బ్లిస్ అనే వ్యక్తి దెబుకారీ అనే సంస్థను స్థాపించి లావుగా ఉన్న వ్యక్తులను అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టారు. లావుగా ఉన్న వ్యక్తులు తమకంటే లావుగా ఉన్న వ్యక్తులను పక్కన ఉంచుకుంటే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ మంత్రం బాగా పనిచేయడంతో జపాన్‌లో ఈ సంస్థకు బాగా పేరు రావడమే కాకుండా మంచి…
మెక్సికోలోని శాంటామారియా జెకాటేపెక్ లోని ఓ వ్యక్తకి చెందిన పోలంలో సింక్ హోల్ ఏర్పడింది. ఆ సింక్ హోల్ క్రమంగా పెద్దదిగా మారుతూ ఇప్పుడు ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత పెద్దదిగా మారిపోయింది. ఈ సింక్‌హోల్ కు అనుకొని ఓ ఇల్లు కూడా ఉండటంతో ఆ ఇంట్లోని వ్యక్తులను ఇప్పటికే ఖాళీ చేయించారు. నాలుగు రోజుల క్రితం ఆ హోల్లో రెండు పెంపుడు కుక్కలు కూడా పడిపోయాయి. వాటిని రక్షించాలని స్థానికుడు డిమాండ్ చేస్తున్నారు. కానీ, రక్షించడం కుదరదని…