ఎవరో ఓ అధికారి గ్రామంంలోకి వచ్చి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయి, గ్రామస్తులు ఎలా ఉన్నారు అని పరిశీలించినట్టుగా ఓ మొసలి గ్రామంలోకి వచ్చి వీధులన్నీ తిరుగుతూ పరిశీలించింది. గ్రామంలోకి మొసలి రావడంతో గ్రామస్తులు పరుగులు తీశారు. మొసలి మాత్రం దర్జాగా తిరుగుతూ చుట్టూ పరిశీస్తూ వెళ్లింది. భయపడిన గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులు వచ్చి మొసలిని పట్టుకొని నదిలో వదిలేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని కోగిల్బాన్ గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి దగ్గరలో కాలీ నది ఉన్నది. అక్కడి నుంచే ఈ మొసలి వచ్చి ఉంటుందని అదికారులు చెబుతున్నారు. సుమారు అరగంటపాటు మొసలి గ్రామంలో సంచరించింది. అయితే, ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకపోవడం విశేషం.
Read: నీళ్ల అంశాన్ని కేసీఆర్ ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు: రేవంత్ రెడ్డి