మెక్సికోలోని శాంటామారియా జెకాటేపెక్ లోని ఓ వ్యక్తకి చెందిన పోలంలో సింక్ హోల్ ఏర్పడింది. ఆ సింక్ హోల్ క్రమంగా పెద్దదిగా మారుతూ ఇప్పుడు ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత పెద్దదిగా మారిపోయింది. ఈ సింక్‌హోల్ కు అనుకొని ఓ ఇల్లు కూడా ఉండటంతో ఆ ఇంట్లోని వ్యక్తులను ఇప్పటికే ఖాళీ చేయించారు. నాలుగు రోజుల క్రితం ఆ హోల్‌లో రెండు పెంపుడు కుక్కలు కూడా పడిపోయాయి. వాటిని రక్షించాలని స్థానికుడు డిమాండ్ చేస్తున్నారు. కానీ, రక్షించడం కుదరదని…
కరోనా సమయంలో ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారిపోయాయి జీవితాలు. నేను, నా కుటుంబం బతికుంటే చాలు అనుకునే స్థాయికి చేరుకున్నాయి. అయితే, ఇలాంటి సమయంలో ఓ మహిళ తన వీపుపై కరోనా రోగిని ఎక్కంచుకొని నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మహిళ నిహారిక మామ కరోనా బారిన పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోన్నది. నగోల్ నగరం సమీపంలోని భాటీగ్రావ్ గ్రామంలో…
అనగనగా ఓ ఏనుగు. ఆ ఏనుగు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దారికి అడ్డంగా ఏ ద్విచక్రవాహనం ఆగి ఉంది. ఆ వాహనం సైడ్ మిర్రర్‌కు తలకు పెట్టుకునే హెల్మెట్ తగిలించి ఉన్నది. దాన్ని చూసిన ఆ గజరాజు తినే వస్తువు అనుకుందేమో చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగేసింది. ఆ తరువాత తనకేమి తెలియదు అన్నట్టుగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటన అస్సాంలోని గుహవాటి ఆర్మీ క్యాంప్ సమీపంలో జరిగింది. దీనికి సంబందించిన వీడియో సోషల్…
గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఇంత వరకు కంట్రోల్ కాలేదు. ఇక ఇండియాలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 130 కోట్లమంది ఉన్న దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందాలంటే చాలా సమయం పడుతుంది. అవకాశం ఉన్నా కొందరు భయాలతో, అపోహలతో వ్యాక్సిన్ తీసుకోవడానికి సందేహిస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో చెప్పక్కర్లేదు. పైగా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు వారికి కరోనా సోకిందని, చనిపోయారని వార్తలు వస్తున్నాయి. దీంతో పెళ్లి…
బాల్యం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. చిన్నతనంలో ఏం చేసినా దానిని ఇష్టపడతాం. కొంత మంది పిల్లలు టీవీ చూస్తూ, మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. అయితే, ఈ బుడ్డోడు పార్క్ లో అందరి మద్య పెద్దవాళ్లతో కలిసి వాళ్లు చేస్తున్న విధంగా రిథమిక్ గా స్టెప్పులు వేస్తూ మెప్పించాడు. ఈ వీడియోను అమెరికా బాస్కెట్‌బాల్ మాజీ ఆటగాడు రెక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. బుడ్డోడి స్టెప్పులను చూసిన నెటిజన్లు…
భూమిపై తెలివైన జంతువు మనిషి. మనిషితో పాటుగా కొన్ని రకాల జంతువులు కూడా తెలివైనవే. పరిస్థితులకు అనుగుణంగా ఆయా జంతువులు వ్యవహరిస్తుంటాయి. అడవిలో ఉండే జంతువులకు దాహం వేస్తే సాధారణంగా నదులు, చెరువుల వద్దకు వెళ్లి దాహం తీర్చుకుంటాయి. అయితే, మహారాష్ట్రలోని గడ్చిరౌలిలోని కమలాపూర్ లో ఏనుగుల కోసం ప్రభుత్వం ఓ శిభిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిభిరంలో వందలాది ఏనుగులు ఆశ్రయం పొందుతున్నాయి. ఈ శిభిరంలో ఉన్న ఆడ ఏనుగు ఒకటి దాహం తీర్చుకోవడానికి చెతిపంపు…
పులి వేట ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పులి టార్గెట్ చేస్తే ఖచ్చితంగా దానికి దొరికిపోతుంది. కానీ, ఓ చిన్నబాతుమాత్రం పులికి చుక్కలు చూపించింది. చిన్న కొలనులో ఉన్న బాతును అమాంతం మింగేసేందుకు కొలనులోకి దూకింది. కానీ, అందులో ఉన్న బాతు ఆ పులికి దొరకలేదు సరికదా పులిని ముప్పుతిప్పలు పెట్టింది. పులి దగ్గరకు రాగానే నీటిలో మునిగి మరోచోట తెలింది. అక్కడికి వస్తే ఆ బాతు అక్కడి నుంచి తప్పించుకొని మరలా వేరే చోట…
1990’ల కాలంలో ‘మిస్టర్ బీన్’ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రోవాన్ ఎట్కిన్‌సన్. తాజాగా మిస్టర్ బీన్ అలియాస్ రోవాన్ ఎట్కిన్‌సన్ చనిపోయాడంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఫేస్బుక్ ఫేక్ పేజ్‌లో మే 29న నటుడు రోవాన్ ఎట్కిన్‌సన్ చనిపోయాడని పోస్ట్ పెట్టారు. ఇది నిజమని తెలుసుకొని చాలా మంది షేర్ చేశారు. ఆ ఫేక్ అకౌంట్ కి చాలామంది ఫాలోయర్స్ ఉండటంతో అదే నిజమనుకున్నారు. కాగా అది తప్పుడు వార్త అని తెలియడంతో నెటిజన్స్ బోగస్…
మామూలుగా మనం పాము కనపడితే ఆమడ దూరం పరిగెడతాం. లేదంటే పాములు పట్టుకునే వారికి ఫోన్ చేస్తాం. కానీ, ఆ యువతి మాత్రం అలా చేయలేదు. రోడ్డుపక్కన భయంకరమైన పాము కనిపించగానే వెంటనే దాని తోక పట్టుకుంది. అనంతరం దాని తలను పట్టుకుంది. ఆమె చేతి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు పాము శతవిధాలా ప్రయత్నం చేసింది. కానీ, ఆమె దాన్ని వదలలేదు. పైగా పామును బెల్టు మాదిరిగా నడుముకు చుట్టుకొని తనకేమి తెలియదన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది.…
గతేడాది మార్స్ మీదకు నాసా రోవర్‌ను పంపిన సంగతి తెలిసిందే. ఈ సాసా రోవర్ మార్స్ మీద వాతావరణంపై పరిశోధన చేస్తున్నది. ఇప్పటికే మార్స్ కు సంబందించిన కొన్ని ఫొటోలను రోవర్‌లోని క్యూరియాసిటీ కెమేరాలు ఫొటోలుగా తీసి భూమిమీదకు పంపాయి. తాజాగా, మరో ఫొటోను కూడా భూమి మీదకు పంపింది. అందులో మార్స్ పైన ఆకాశం మేఘాలు కమ్మేసి ఉన్నాయి. మార్స్ వాతావరణం పొడిగా ఉంటుంది. మేఘాలు కమ్మేయడం చాలా అరుదుగా కనిపించే అంశం. సూర్యుడు మార్స్…