ఏదైనా సరే ఒక్కడితోనే మొదలౌతుంది. అతని మార్గాన్ని వేలాది మంది ఫాలో అవుతుంటారు. కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఉద్యోగ, ఉపాది అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలు చేసిన సమయంలో సంపాదించిన మొత్తంతోనే రెండేళ్లుగా ప్రజలు నెట్టుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనాకేసులు తగ్గతుండటంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, పూర్తిస్థాయిలో రవాణా వ్యవస్థ తెరుచుకోలేదు. కేవలం కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. ముఖ్యంగా ముంబై వంటి మహానగరాల్లో సామాన్యులు ప్రయాణం చేసే మెట్రో రైళ్లు తెరుచుకున్నా, ప్రభుత్వ ఉద్యోగులకు, అత్యవసరంగా ప్రయాణం చేసేవారికి మాత్రమే అనుమతిస్తున్నారు.
Read: `భీష్మ`ను క్రాస్ చేసేసిన `రంగ్ దే`!
అయితే ముంబైకి చెందిన ఓ వ్యక్తి లోకల్ రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేశాడు. పరేల్ స్టేషన్ వద్ద ఆ యువకుడిని అధికారులు పట్టుకున్నారు. టిక్కెట్ లేకుండా, నిబంధనలకు విరుద్దంగా ప్రయాణం చేసినందుకు అధికారులు ఫైన్ వేశారు. ఫైన్ కట్టేందుకు యువకుడు వెనకాడలేదు. సంవత్సరం క్రితం తాను నెలకు 35 వేలు సంపాదించేవాడినని, కరోనా కారణంగా ఏడాది క్రితం ఉద్యోగం పోయిందని, ఇటీవలే తకు ఉద్యోగం దోరికందని, సంపాదించిన డబ్బు ఏడాది కాలంగా సరిపోయిందని, ఇప్పుడు తన వద్ద కేవలం 400 మాత్రమే ఉన్నాయని, ఈ డబ్బే ప్రస్తుతానికి ఆధారమని ఆ యువకుడు తెలిపాడు.
తనలాంటి వారికి లోకల్ ట్రైలో మాత్రమే ప్రయాణం చేయగలరని, తనలాగే నగరంలో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే లోకల్ ట్రైన్‌లలో అనుమతి ఇస్తే ఎలా? బయట ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేయాలంటే అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ యువకుడు పేర్కొన్నాడు. యువకుడి ఆవేదనను సోషల్ మీడియా ఆర్ధం చేసుకుంది. తనలాగే లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నామని నెజిజన్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబైలో బస్సులు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే లోకల్ రైళ్లలో సాధారణ ప్రజానికానికి అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు.