పహల్గామ్ దాడి తర్వాత.. భారతదేశం పాకిస్థాన్‌పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భారతదేశం నిర్ణయించింది. అలాగే.. భారతదేశంలోని పాకిస్థాన్ దౌత్యవేత్తలను 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంతలో పాకిస్థాన్ హైకమిషన్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాకిస్థాన్ హైకమిషన్‌కు కేక్ తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.
KL Rahul: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో ప్లేఆఫ్స్ స్థానాల కోసం జట్లు అమీ తుమి తేల్చుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతి జట్టు కనీసం ఏడు మ్యాచులు ఆడడంతో సగం ఐపీఎల్ సీజన్ ముగిసినట్లయింది. ఇకపోతే ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ప్లేఆఫ్ స్థానాల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్…
జమ్మూ కాశ్మీర్లో మంగళవారం చోటుచేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం. మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే.. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధుడిని వైద్య సిబ్బంది కనికరం లేకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు వైద్యులపై సస్పెండ్ వేటు వేసింది.
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారాడు. సినిమాల విషయాన్ని ప్రక్కన పెడితే యష్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమట. ఆయన వద్ద కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయట. ఇటీవల, ఆయన తన భార్య రాధికా పండిట్‌తో కలిసి ఓ…
Anna Lezhneva Konidela: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడిన ఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల నేడు మొదట తిరుమలలోని గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సైన్ చేశారు. టీటీడీ నియమాల ప్రకారం.. అన్య మతస్థులు తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే వారు శ్రీవారిపై నమ్మకం ఉందంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి…
Jagapathibabu : విలక్షణ నటుడు జగపతి బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వ్యవహరించే తీరుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో హీరో నుంచి ఇప్పుడు విలన్ పాత్రల దాకా అన్నీ పోషిస్తున్నారు. సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలు అంటే అందరికీ జగపతి బాబే గుర్తుకు వస్తున్నాడు. ఆ స్థాయిలో ఆయన నటిస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో తన లైఫ్ కు సంబంధించిన అనేక విషయాలను ఆయన పంచుకుంటారు.…
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో చాలా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో చిక్కుకున్న పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని 44 ఏళ్ల సిజోగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిజో మంగళవారం రాత్రి తన కుక్కలకు మాంసం స్క్రాప్లు కొని ఇంటికి తిరిగి వస్తున్నాడు.
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్, లక్నో, చెన్నైపై గెలిచిన పంజాబ్.. రాజస్థాన్ చేతిలో మాత్రం ఓడింది. ఇక ఏప్రిల్ 12న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో ఢీకొనేందుకు సిద్దమైంది. అయితే మంగళవారం రాత్రి చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కో ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు సంబంధించిన ఓ సోషల్ మీడియాలో వైరల్…
Uttar Pradesh: ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి బాగా ముదురుతోంది. ప్రమాదకరమైన స్టంట్స్ చేసి వ్యూస్, ఫాలోవర్లను రాబట్టుకోవాలని కంటెంట్ క్రియేటర్లు చూస్తు్న్నారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ కు చెందిన ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై పడుకుని, ప్రయాణిస్తున్న ట్రైన్‌ని షూట్ చేశాడు. వేగంగా వస్తున్న రైలు అతడిపై నుంచి వెళ్లడం చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.