Viral : వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అన్న మాటను మరోసారి నిజం చేసిన ఘట్టం ఇది. హర్యానాకు చెందిన ఓ తాతయ్య, తన మనవడు ఇచ్చిన ఫోర్డ్ మస్టాంగ్ కీతో కారులోకి ఎక్కి ఊహించని రీతిలో డ్రిఫ్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. సినీ స్టైల్లో స్టంట్లు చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. “తాత రాక్ – మనవడు షాక్!” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దేవ్ చహల్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో, మనవడు తన తాతయ్యకు కార్ కీ ఇస్తూ, “ఇదిగో మీది… జాగ్రత్తగా నడపండి” అని నవ్వుతూ చెబుతాడు. తాతయ్య ఆ కీ అందుకున్న వెంటనే ఆనందంగా కారులోకి ఎక్కి, కారు స్టార్ట్ చేసి ఊహించని స్టైల్లో డ్రిఫ్టింగ్ మొదలుపెడతారు. ఈ సీన్ చూడటానికి ఏదైనా సినిమా క్లైమాక్స్ సీన్ లాగానే ఉంది.
Pooja Hegde : దాని కోసం ఎక్స్‌ట్రా వర్కౌట్లు చేయకతప్పదు..
తాతయ్య చేసిన స్టంట్స్ చూసి షాక్ అయిన మనవడు, “ఇదేమిటండీ తాతయ్య” అని అడుగుతాడు. దీనికి తాతయ్య నవ్వుతూ, “మేము ట్రాక్టర్ల ముందు చక్రాలను గాల్లోకి లేపి, కిలోమీటర్ల పాటు నడిపినవాళ్లం బాబు.. ఇది పెద్ద విషయం కాదు..” అంటూ చెప్పిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పటికే 5.7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా, నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు “తాతయ్య రాక్ – మనవడు షాక్!” అంటూ కామెంట్ చేయగా, మరొకరు “ఈ వయస్సులో ఇలా స్టంట్ చేయడం అదిరిపోయింది తాతయ్యా..” అన్నారు. ఇంకొకరు అయితే “తాతయ్య మాటలు వినగానే ఓ స్పూర్తి వచ్చింది. నిజంగా హ్యాట్సాఫ్!” అని స్పందించారు.
Renu Desai : చైనా పై రేణు దేశాయ్ హాట్ కామెంట్స్.. ?