Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటువాద ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ లోని అతిపెద్ద ప్రావిన్సు, అత్యధిక ఖనిజవనరులు కలిగిన బలూచిస్తాన్ సొంతదేశం కోసం పోరాటం చేస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఇటీవల బలూచిస్తాన్‌ని స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకుంది. తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితిని కూడా ఆశ్రయించింది. మరోవైపు, బీఎల్ఏ యోధులు పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. పాక్ ఆర్మీ కనిపిస్తే దాడులు చేస్తున్నారు. ఆపరేషన్ హరోప్‌తో పాక్ సైన్యాన్ని వేటాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే, క్వెట్టా, పంజ్‌గుర్, కెచ్ వంటి ప్రాంతాలు మినహా 80 శాతం బలూచ్ ప్రావిన్సుపై పాకిస్తాన్ అధికారం లేదు.
Read Also:Jharkhand: ప్రియుడితో బెడ్‌రూంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భార్య.. భర్త ఏం చేశాడంటే?
ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్‌లోని మరో ప్రాంతం ప్రత్యేక దేశం కోసం ఉద్యమిస్తోంది. సింధు ప్రావిన్సు ప్రజలు ‘‘సింధుదేశ్’’ కోసం ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. తాజాగా, ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. మరోవైపు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రజలు కూడా తమని తాము పాకిస్తాన్ ప్రజలుగా చెప్పుకోవడం లేదు. ఈ ప్రాంతానికి ఆఫ్ఘనిస్థాన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే, పాకిస్తాన్‌లో చివరకు మిగిలేది ఒక్క ‘‘పంజాబ్ ప్రావిన్సు’’ మాత్రమే.
నిజానికి పాకిస్తాన్‌లో పంజాబ్ ప్రావిన్సు ఆధిపత్యమే అధికం. ఈ ప్రాంతం నుంచి రాజకీయ, సైనిక నాయకత్వం వస్తుంది. పాక్ ఆర్మీలో దాదాపుగా 90 శాతం మంది సైనికులు పంజాబ్ నుంచే ఉంటారు. కీలక ఆర్మీ జనరల్స్, ప్రధానులు ఈ ప్రాంతానికి చెందిన వారే. దీంతో ఎప్పటి నుంచో సింధ్, కైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. తాజాగా, సింధ్‌దేశ్ ఉద్యమం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.
ఈ డిమాండ్ ఇప్పటిది కాదు.
1950 నుంచే సింధుదేశ్ ని అక్కడి ప్రజలు కోరుతున్నారు. సింధ్ ప్రాంతానికి తనదైన సింధీ భాష, సంస్కృతి ఉంది. అయితే పాక్ ప్రభుత్వం బలవంతంగా ఉర్దూ భాషని రద్దడం అక్కడి ప్రజలకు రుచించలేదు. 1950లో ‘‘వన్ యూనిట్ ప్లాన్’’ కింద సింధ్, పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలను ఒక యూనిట్‌గా, అప్పటి తూర్పు పాకిస్తాన్(బంగ్లాదేశ్)ని మరో సింగిల్ యూనిట్‌గా ప్రకటించారు. అప్పటి నుంచి సింధ్ ప్రజల్లో ప్రత్యేక దేశంపై ఆశ ఉంది. బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో పాక్ ఆర్మీ ఆ ప్రాంతంలో దురాగతాలకు పాల్పడుతున్న సమయంలో సింధ్ ప్రత్యేక దేశం కోసం ఉద్యమించింది. పాకిస్తాన్ సైన్యం తమ సంస్కృతిని, గుర్తింపును, భాషను లాక్కుంటోందని ప్రజలు అంటున్నారు. వన్-యూనిట్ ప్రణాళిక సింధ్ ప్రజల గుర్తింపును చాలావరకు నాశనం చేసిందని అక్కడి ప్రజల్లో కోపం ఉంది.
Internal rebellion in Pakistan is at its peak!!
After Balochistan, now the demand for independence of Sindhudesh intensifies in Pakistan-The videos have created ripples in Pak
Whoever clashes with India will be reduced to dust!! pic.twitter.com/oXmsXztE64
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 17, 2025