భారత సైన్యం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ తీవ్రంగా కృంగిపోయింది. రోజురోజుకూ ఓటమి వైపు పయనిస్తున్న పాకిస్థాన్ సైన్యం.. ఇప్పుడు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్ సైన్యం కొత్త అబద్ధాలను పుట్టిస్తోంది. అయితే.. శనివారం మరో కొత్త దుష్ర్పాచారం చేసింది. ఢిల్లీ విమానాశ్రయంపై క్షిపణితో విజయవంతంగా దాడి చేశామని, ఈ దాడిలో విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైందని పాకిస్థాన్ పేర్కొంది.
READ MORE: BLA: 39 ప్రాంతాల్లో పాక్ ఆర్మీపై బలూచిస్థాన్ దాడులు.. మరో పట్టణం స్వాధీనం!
ఈ దాడికి సంబంధించి పాకిస్థాన్ సైన్యం కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో ఓ నకిలీ వీడియో వ్యాప్తి చేసింది. ఈ వీడియోలో ఒక చమురు గిడ్డంగి ఉందని, అందులో భారీ మంటలు చెలరేగాయని చూపారు. ఈ వీడియోను పాకిస్థాన్ మీడియా తీసుకుని.. అబద్ధాలను వ్యాప్తి చేసింది. పాకిస్థాన్ క్షిపణి ఢిల్లీ విమానాశ్రయంపై దాడి చేసి నాశనం చేసిందని మీడియా పేర్కొంది. దీనిపై భారత్ స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఢిల్లీ విమానాశ్రయంపై క్షిపణి దాడిని ఖండించింది. పాకిస్థాన్ షేర్ చేసిన వీడియో 2024 ఆగస్టులో యెమెన్ అడెన్‌లోని ఒక గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడుకు సంబంధించినదని తేల్చ చెప్పింది. ఈ వీడియోకు ఢిల్లీ విమానాశ్రయంతో లేదా ప్రస్తుత భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతతో ఎటువంటి సంబంధం లేదని పీఐబీ స్పష్టం చేసింది. పీఐబీ రుజువుగా అసలు వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియో ఓ విదేశీ వార్తా ఛానెల్‌లో ప్రసారం చేయబడింది.
READ MORE: IND PAK War: పాక్ ఎన్ని డ్రోన్స్, క్షిపణులను ప్రయోగించినా భారత్ ఇట్టే కూల్చేస్తోంది.. కారణాలేంటి?
🚨 Missile Attack on Delhi Airport?
An old video is being falsely shared as footage of a missile strike on New Delhi Airport.#PIBFactCheck
❌ This video shows a gas station explosion in Aden, Yemen, from August 2024.
✅ It has no connection to the current India–Pakistan… pic.twitter.com/pFqfDO50nm
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025