Abhishek-Aishwarya Rai: పెళ్లి వేడుకలో కూతురితో కలిసి రచ్చరచ్చ చేసిన బచ్చన్ దంపతులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek-Aishwarya Rai: బాలీవుడ్ లో “కజరారే” పాట పేరు వినగానే గుర్తొచ్చే జంట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. 2005లో విడుదలైన “బంటి ఔర్ బబ్లీ” సినిమాలో ఈ పాట అభిమానుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఆ ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్ లో అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ఐకానిక్ స్టెప్స్ ను మరోసారి తిరిగితెచ్చారు బచ్చన్ దంపతులు. ముంబయిలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఐశ్వర్య, అభిషేక్, వారి కుమార్తె ఆరాధ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకలో “కజరారే” పాటకు లైవ్‌గా గాయకుడు రాహుల్ వైద్య పాడుతుండగా, బచ్చన్ కుటుంబం స్టేజీపైకి ఎక్కి సంతోషంగా స్టెప్పులు వేసింది.
Read Also: Mirchowk Fire Accident : హృదయవిదాకరం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. మృతుల్లో 8 మంది చిన్నారులు
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నిన్నటిదాకా విడాకుల వార్తలతో హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో.. ఇలా కుటుంబ సమేతంగా సంతోషంగా స్టేజ్ పై కనిపించడం అభిమానులను ఎంతో ఆనందపరిచింది. ఇదే పాటకు గత నెలలో కూడా ఈ జంట డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఐశ్వర్య కజిన్ శ్లోకా శెట్టి సోదరుని వివాహ వేడుకలో పుణేలో పాల్గొన్నప్పుడు వధూవరులు ఐశ్వర్య, అభిషేక్‌ను స్టేజీపైకి ఆహ్వానించగా, వారు తమ ప్రత్యేక స్టెప్పులతో కజరారే స్టెప్స్ ను మళ్లీ ప్రదర్శించారు. ముఖ్యంగా, ఆరాధ్య కూడా స్టేజ్‌పైకి వచ్చి తల్లిదండ్రులతో సమానంగా స్టెప్పులు వేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Read Also: CM Chandrababu: మీర్ చౌక్ అగ్నిప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి..
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ మొదటిసారి 1999లో ‘ధై అక్షర్ ప్రేమ్ కే’ సెట్స్‌లో కలుసుకున్నారు. అనంతరం 2007 ఏప్రిల్ 20న వారు వివాహం చేసుకున్నారు. ఈ జంట 2011 నవంబరులో ఆరాధ్యకు తల్లిదండ్రులుగా మారారు. ఇక వృత్తిపరంగా చూస్తే, ఐశ్వర్యా రాయ్ చివరిసారి మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన “పొన్నియిన్ సెల్వన్: II” లో నందినిగా నటించారు. అభిషేక్ బచ్చన్ చివరిసారి “బి హ్యాపీ” అనే అమెజాన్ ప్రైమ్ ఓరిజినల్ లో నటించారు. ఆయన త్వరలోనే అక్షయ్ కుమార్‌తో కలిసి “హౌస్‌ఫుల్ 5” లో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!