Viral News: నిద్రలో ఒక కల వచ్చింది.. అది మంచిది అయితే అలాగే ఆస్వాదిస్తాం.. అదే చెడ్డది అయితే ఉలిక్కిపడి లేస్తాం. అది సహజమే. ఎందుకంటే మెదడు లో ఉండే కొన్ని హార్మోన్స్ మనల్ని వార్న్ చేస్తూ ఉంటాయి.
Viral News: అదొక బీచ్.. సాయంసంధ్య వేళ పర్యాటకులందరితో కళకళలాడుతోంది. కుటుంబాలు వారి పిల్లలతో జలకాలాడుతున్నారు. ఇక అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కసారిగా అలికిడి మొదలయ్యింది.
Indian Railways: రైళ్లలో ఐదేళ్లలోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలంటూ వస్తున్న వార్తలను రైల్వేశాఖ ఖండించింది. రైళ్లలో ప్రయాణించే చిన్నారుల టికెట్ బుకింగ్ విషయంలో ఎలాంటి మార్పులు ప్రకటించింది. ఒకటి నుంచి ఐదేళ్ల వయస్సు గల పిల్లలకు పెద్దలకు వర్తించే టికెట్ ధరలు వర్తిస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలందరూ గతంలో తరహాలోనే రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించింది. అయితే ప్రత్యేకంగా బెర్త్ లేదా సీట్ కేటాయించడం…
Andhra Pradesh RGF: కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) గురించి అందరికీ తెలుసు. కేజీఎఫ్ సినిమాతో ఈ విషయం విశ్వమంతా తెలిసింది. అయితే ఏపీలో RGF ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆర్జీఎఫ్ అంటే రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ . నష్టాల కారణంగా రెండు దశాబ్దాల క్రితం ఆర్జీఎఫ్కు తాళం పడగా.. ఇప్పుడు మళ్లీ తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రామగిరి బంగారు గనుల కోసం టెండర్లు మెుదలయ్యాయి. ఆగస్టు నెలాఖరులో టెండర్లు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం…
Dubai Crown Prince: ఓ దేశానికి రాజు అంటే ఆయనకు సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాజు ఎక్కడికి వెళ్లినా సకల భోగాలను అనుభవించాల్సిందే. భద్రత దృష్ట్యా వాళ్లు విమానాలు, హెలికాప్టర్లు, కార్లలో తిరుగుతుంటారు. అయితే అలాంటి రాజభోగాలను పక్కనపెట్టి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ లండన్ మెట్రోలో సామాన్య పౌరుడిగా పర్యటించి అందర్ని ఆశ్చర్యపరిచాడు. కానీ సదరు యువరాజు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన్ను…
Postal Pincode: ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో దేశమంతటా వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. అయితే పోస్టల్ పిన్కోడ్ కూడా ఈరోజే గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుంటోంది. పోస్టల్ సర్వీస్ కు సంబంధించిన పిన్ కోడ్ ఆవిర్భవించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. పోస్టల్ ఇండెక్స్ నంబర్(PIN)ను పిన్ కోడ్ లేదా, ఏరియా కోడ్ లేదా జిప్ కోడ్ అని పిలుస్తారు. ఇది 1972 ఆగస్టు 15న ప్రారంభమైంది. దేశంలోని అనేక ప్రాంతాల పేర్లు…
Lawyer Fight For Justice: డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి… రూపాయి ఉచితంగా వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. మరి మన డబ్బులు మనం సాధించుకోవడంలో పోరాటం చేస్తే తప్పేముంది. ఓ న్యాయవాది కూడా ఇలాగే ఆలోచించాడు. వివరాల్లోకి వెళ్తే.. తుంగనాథ్ చతుర్వేది అనే లాయర్ 1999లో ఉత్తరప్రదేశ్లోని మధుర కంటోన్మెంట్ స్టేషన్లో తనతో పాటు మరో వ్యక్తి కోసం రూ.70కి రెండు రైలు టికెట్లు కొన్నాడు. టిక్కెట్ ధర ఒక్కొక్కటి రూ.35. అయితే చతుర్వేది రూ.100…
VLC Media Player: అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా ప్లేయర్ సాఫ్ట్వేర్, స్ట్రీమింగ్ మీడియా సర్వర్ VLC మీడియా ప్లేయర్ ఇకపై భారతదేశంలో పని చేయదు. ఎందుకంటే VLC మీడియా ప్లేయర్పై భారత ప్రభుత్వం రెండు నెలల కిందటే నిషేధం విధించినట్లు తెలుస్తోంది. మన దేశంలో VLC మీడియా ప్లేయర్, డౌన్లోడ్ లింక్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో దాన్ని డౌన్లోడ్ చేసుకునేందుకు కుదరడం లేదు. చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ Cicada సైబర్ అటాక్స్ జరిపేందుకు…