Viral News: అదొక బీచ్.. సాయంసంధ్య వేళ పర్యాటకులందరితో కళకళలాడుతోంది. కుటుంబాలు వారి పిల్లలతో జలకాలాడుతున్నారు. ఇక అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కసారిగా అలికిడి మొదలయ్యింది. అక్కడ చూసిన ఘటనకు పిల్లలు బెంబేలెత్తిపోయారు. ఒక యువతి దేహం తల లేకుండా అర్ధనగ్నంగా కనిపించింది. ఒక్కసారిగా పర్యాటకులందరూ షాక్ అయ్యి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. హుటాహుటిన పరుగెత్తికొచ్చిన పోలీసులు ఆ దేహాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోస్టుమార్టం అని, మర్డర్ అని ఏవేవో ఆలోచించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే చివరికి వారికి తెల్సిన నిజం విని అందరు అవాక్కయ్యారు. ఈ ఘటన థాయ్ ల్యాండ్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. ఏది కావాలన్నా కొన్నిదేశాల్లో రోబోలే తీసుకొస్తున్నాయి. ఇక శృంగారం కోసం స్పెషల్ గా శృంగారపు బొమ్మలు(Sex Dolls) ను ఉపయోగిస్తున్నారు. తమకు నచ్చిన రూపాన్ని ఆ బొమ్మకు పెట్టించి లైంగిక సంతృప్తి పొందుతున్నారు. ఇక తాజాగా ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న డాల్ ను పనికి రాదని బీచ్ ఒడ్డున పడేశాడు. అది నీళ్లలో కొట్టుకోవచ్చి తల లేకుండా మొండెం తో ఒడ్డుకు చేరింది. దాన్ని చూసి అక్కడ ఉన్నవారందరూ యువతి మొండెం అనుకున్నారు. అంతేకాకుండా ఆమెను అత్యాచారం చేసి ఇలా చేసి ఉంటారని అనుమానించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు సైతం మొండెం యొక్క తల కోసం బీచ్ మొత్తం వేట మొదలుపెట్టారు. ఇక చివరికి ఆ మొండెం తల చూసి షాక్ అయ్యారు. అది అసలు మనిషి కాదని, ఒక బొమ్మ అని తెలుసుకొని షాక్ అయ్యారు. జపాన్ కు చెందిన ఈ బొమ్మ విలువ రూ. 45 వేలు ఉంటుందని అంచనా. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఆ బీచ్ లో హాట్ టాపిక్ గా మారింది.