Chennai man Worked in Three Companies: వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రెండు కంపెనీలలో పని చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడం చూశాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా మూడు ఉద్యోగాలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే చెన్నైలో ఓ వ్యక్తి ఒకే సమయంలో మూడు కంపెనీలలో ఉద్యోగాలను చేస్తున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. శ్వేతా శంకర్ అనే మహిళ ర్యాపిడో బుక్ చేసుకోగా.. శంకర్…
World Largest Pen: సాధారణంగా మనం రాసుకునే పెన్ను జానా బెత్తెడు ఉంటుంది. అంత సైజు ఉంటేనే పెన్నుతో మనం రాయగలం. కానీ అదే పెన్ను 20 అడుగులు ఉంటే అది రికార్డే అవుతుంది. తాజాగా దేశంలోని ఓ పెన్ను ప్రపంచంలోనే అతి పెద్ద పెన్నుగా అవతరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలోని నౌరంగాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ అట్రీ అతిపెద్ద ఇంక్ పెన్ను తయారు చేశాడు. 20 అడుగుల పొడవు, 43 కిలోల బరువు…
Make Love Not War: ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు ఓ జంట ప్రేమ కూడా నడిపిస్తోంది. రష్యాలో జన్మించిన వ్యక్తి, ఉక్రెయిన్‌లో జన్మించిన మహిళ ప్రేమించుకుని భారత్‌లో ఒక్కటయ్యారు. ఆగస్టు 2న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 5న తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఈ విషయం బహిర్గతమైంది. వివరాల్లోకి వెళ్తే.. 28 ఏళ్ల ఉక్రెయిన్…
Interesting Facts: చాలా మంది పుణ్యక్షేత్రాలను చూసేందుకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే కొలనులు, సరస్సులు, నదుల్లో కాయిన్స్ వేయడాన్ని చాలా మంది గమనించే ఉంటారు. రైలులో వెళ్లేటప్పుడు కృష్ణా బ్రిడ్జి, గోదావరి బ్రిడ్జిలపై నుంచి కూడా ప్రయాణికులు రూపాయి బిళ్లలు నదుల్లో పడేస్తుంటారు. కానీ అలా ఎందుకు వేస్తారో కొంతమందికి తెలియక సందిగ్ధంలో పడుతుంటారు. అయితే నదుల్లో, ఆలయాలలో ఉండే కొలనుల్లో కాయిన్స్ వేయడానికి చాలా కారణాలున్నాయని పెద్దలు వివరిస్తున్నారు. పురాతన కాలంలో రాగి నాణేలను ఎక్కువగా…
Ganesh Chaturthi: సకల దేవతలకు గణపతి దేవుడు గణ నాయకడు. అందుకే ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా గణపతిని పూజిస్తుంటారు. బ్రహ్మదేవుడు సైతం తన సృష్టి రచనకు ముందుగా గణపతిని పూజించినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అటువంటి వినాయకుడి పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి పండుగగా అందరూ జరుపుకుంటారు. సాధారణంగా వినాయకచవితిని చాంద్రమానంలోని ఆరో నెలలో జరుపుకుంటాం. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు వేర్వేరు కోణాల్లో ఉంటారు. కాబట్టి భూమిపై…
Ganesh Chaturthi: వినాయక చవితి సందర్భంగా పలువురు రకరకాల డిజైన్లలో గణేష్ ప్రతిమలను తయారు చేస్తున్నారు. గతంలో గబ్బర్‌సింగ్, RRR, బాహుబలి, స్పైడర్‌మ్యాన్, అవెంజర్స్ వంటి గణేష్ ప్రతిమలు మార్కెట్లో విక్రయానికి వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ స్టైలులో ఉన్న వినాయకుడు కూడా మార్కెట్లోకి వచ్చేశాడు. పుష్పలో సూపర్‌హిట్ డైలాగ్ ‘తగ్గేదే లే’ స్టిల్‌లో ఈ వినాయకుడిని తయారు చేయగా ఈ గణేష్ విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్…
Yellow Crazy Ants: చీమే కదా అని తక్కువ అంచనా వేయకండి. సైజులో చిన్నగా ఉన్నా చీమ కుడితే ఎంతటి ప్రాణి అయినా గిలగిల కొట్టుకోవాల్సిందే. చీమలు లక్షల సంఖ్యలో దండయాత్ర చేస్తే ప్రజలు వణికిపోవాల్సిందే. తమిళనాడులోని పలు గ్రామాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడి గ్రామాలపై చీమలు దండెత్తాయి. గ్రామాల్లోకి చొచ్చుకొస్తున్న చీమల దండు కనిపించిన ప్రతి వస్తువును తినేస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు.…