Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేకం ఉత్సవాలు మార్చి 6 నుంచి మార్చి 8 వరకు వైభవంగా జరగనున్నాయి. మహోత్సవాల తొలి రోజు నేడు ఉదయం 7 గంటలకు కనకదుర్గా నగర్ నుంచి అర్చకులు కలశాలతో ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు ఘనంగా సాగుతూ ఇంద్రకీలాద్రి చేరుకోనుంది. అక్కడ మహా కుంభాభిషేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఆ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు బైబై..!
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఇక సాయంత్రం 4 గంటలకు అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు మంత్రపుష్పంతో తొలి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. మూడు రోజుల పాటు వివిధ పూజలు, హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ మహోత్సవాలను తిలకించేందుకు మూడు రోజులలో సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దసరా ఉత్సవాల తరహాలోనే భారీ ఏర్పాట్లు దేవస్థానం చేపట్టింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
అస్సాంలో సుఖోయ్ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్..
మరోవైపు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వి.ఐ.పి, వి.వి.ఐ.పి దర్శనాలకు ప్రత్యేక సమయాలను కేటాయించారు. అలాగే మార్చి 9 వరకు అర్జిత సేవలను రద్దు చేసినట్లు దేవస్థానం ప్రకటించింది. మూడు రోజుల పాటు అంతరాల దర్శనాలను కూడా నిలిపివేశారు. ఈ సమయంలో భక్తులకు బంగారు వాకిలి వరకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు.
తాజావార్తలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!