Ganesh Chaturthi: వినాయక చవితి సందర్భంగా పలువురు రకరకాల డిజైన్‌లలో గణేష్ ప్రతిమలను తయారు చేస్తున్నారు. గతంలో గబ్బర్‌సింగ్, RRR, బాహుబలి, స్పైడర్‌మ్యాన్, అవెంజర్స్ వంటి గణేష్ ప్రతిమలు మార్కెట్లో విక్రయానికి వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ స్టైలులో ఉన్న వినాయకుడు కూడా మార్కెట్లోకి వచ్చేశాడు. పుష్పలో సూపర్‌హిట్ డైలాగ్ ‘తగ్గేదే లే’ స్టిల్‌లో ఈ వినాయకుడిని తయారు చేయగా ఈ గణేష్ విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ విగ్రహం నెటిజన్‌లను ఎంతో ఆకట్టుకుంటోంది.
Read Also: నిర్మాతలుగా మారి ఆస్తులు పోగొట్టుకున్న హీరోయిన్లు వీరే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న స్టార్ డమ్‌కు ఈ వినాయకుడు ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తున్నాడని అతడి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అటు పాపులారిటీలోనూ అల్లు అర్జున్ కొత్త శిఖరాలను అందుకుంటున్నాడంటూ చర్చించుకుంటున్నారు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-ది రూల్ మూవీ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అమాంతం అతడి క్రేజ్ పెరిగిపోయింది. బాలీవుడ్‌లో ఈ మూవీ అనూహ్యంగా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. అటు సినిమాలతో పాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నాడు. తాజాగా కోకాకోలా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయనతో యాడ్ షూట్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి.