New Year Celebrations: నూతన సంవత్సరం ప్రారంభానికి ముందే పుణేలోని ఒక పబ్ నిర్వహించిన కార్యక్రమం వివాదాస్పదమైంది. కొత్త సంవత్సరం సంబరాలకు పబ్ నుండి పంపించిన ఆహ్వానంలో కండోమ్స్ తోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై పుణే పోలీసులు విచారణ ప్రారంభించారు. పుణేలోని ఒక పబ్ కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఒక ప్రత్యేక పార్టీ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి పంపిన ఆహ్వానంలో కండోమ్స్ తోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా…
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆలయంలో దొంగతనానికి పాల్పడే ముందు దొంగ ఆలయ ప్రాంగణంలో కూర్చుని దేవుడికి పూజలు చేశాడు. దీని తరువాత.. ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహానికి అలంకరించిన కిరీటాన్ని దొంగిలించి పారిపోయాడు. ఈ చోరీ ఘటన అంతా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
పెళ్లిళ్లలో డబ్బు వృథా చేయడం పెద్ద విషయం కాదు కానీ.. పాకిస్థాన్లో ఓ పెళ్లిలో డబ్బులు వృథా చేసిన తీరుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక తండ్రి తన కొడుకు పెళ్లి కోసం విమానం బుక్ చేశాడు. ఈ విమానం వధువు ఇంటిపై డబ్బు వర్షం కురిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎగతాలి చేస్తున్నారు.
ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలో కూడా ఇలాంటి కేసు ఒకటి బయటకు వచ్చింది. అయితే ఇక్కడ యువకుడి చాకచక్యం చూసి దుండగుడే నవ్వుకున్నాడు. కొంత సమయం తర్వాత స్కామర్ స్వయంగా ఫోన్ను డిస్కనెక్ట్ చేయవలసి వచ్చింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. జనాలు నవ్వు ఆపుకోలేక పోతున్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ 26 (గురువారం) నుంచి మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. కోహ్లీపై ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు, బిగ్బాస్ పార్టిసిపెంట్ రాహుల్ వైద్యను కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేశాడు.
Air India: ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్రెస్ట్ కోసం ఘర్షణకు దిగారు. అయితే, డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఫ్లైట్ లోని ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్రెస్ట్ విషయంలో ఆ ఇద్దరు ప్రయాణికులు కొట్టుకున్నారు.
ఏ వ్యక్తికైనా వివాహం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. పెళ్లి నిర్ణయం జీవితంపై ఆధారపడి ఉంటుంది. ఇకవేళ తప్పటడుగు వేస్తే జీవితాంతం భరించాల్సి ఉంటుంది. అలాంటి ఓ ఘటన చైనాలో జరిగింది. పెళ్లి కాకముందే ఓ చైనా వ్యక్తి మనోవేదనకు గురయ్యాడు. పెళ్లి గురించి ఆత్రుతగా ఉన్న అతను పెళ్లికి ముందే తన కాబోయే భార్య కోసం దాదాపు రూ.55 లక్షలు ఖర్చు చేశాడు. అయితే.. పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి ముందే పెళ్లయినట్లు తెలిసింది. దీంతో బిత్తర…
ప్రస్తుతం సోషల్ మీడియాలో 'డిజిటల్ మోడల్' చిత్రాలు వైరల్ అవుతున్నాయి. మనకు తగినంత నిద్ర లేకపోతే 2050 నాటికి మనుషులు ఎలా ఉంటారో ఆ చిత్రాల ద్వారా చెబుతున్నారు. బ్రిటిష్ కి చెందిన స్లీప్ ఎక్స్పర్ట్ డాక్టర్ సోఫీ బోస్టాక్ సహాయంతో బెన్సన్స్ ఫర్ బెడ్స్ అనే సంస్థ.. ఈ పరిశోధన చేసింది. స్త్రీ శరీరం సాధారణంగా రాత్రికి ఆరు గంటలపాటు నిద్రపోతే ఆమె 25 ఏళ్లలో ఎలా మార్పు చెందుతోందో డిజిటల్ చిత్రాల ద్వారా తెలిపారు.
చాలా మంది ప్రైవేట్ ఉద్యోగానికి బదులు ప్రభుత్వ ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కర్ణాటకలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిళ్లపై ఓ తహసీల్దార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మిగిలేది లేదని, పానీపూరీ అమ్మే వాడు మనకంటే గొప్పవాడని తహసీల్దార్ చెప్పారు. పానీ పూరీ అమ్మేవాడి సంపాదన కూడా తమ కంటే…
Robotic Elephant Donated by Shilpa Shetty and Raj Kundra couple: బాలీవుడ్ నటి శిల్పా షెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని రాంభాపురి మఠానికి ఒక రోబోటిక్ ఏనుగును దానం చేశారు. ఈ రోబోటిక్ ఏనుగు మఠంలోని భక్తులకు సేవలందించడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం స్థానికంగా పెద్ద ఎత్తున జరగడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోబోటిక్ ఏనుగు గుడి కార్యక్రమాలకు, పవిత్ర ప్రాంతాలకు…