లైకులు, కామెంట్ల కోసం కొందరు ఎన్ని విన్యాసాలు అయినా చేస్తారు. అలాంటి విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు దొరుకుతాయి. కొందరు స్టంట్స్ చేయబోయి అడ్డంగా బుక్కయిపోవడం కూడా చూశాం. కొందరు స్టంట్స్‌ను అదరగొట్టేస్తారు. మరికొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు అంటూ స్టంట్స్ అంటూ చేసి ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో వైరల్‌గా మారింది. READ MORE: UPI: వామ్మో.. యూపీఐ ద్వారా11…
ప్రస్తుతం ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక కథనంలోని కొన్ని పాయింట్స్ తీసుకుని రాశారు. ఈ కథన ప్రకారం.. "ఇప్పుడు మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతా తెరవలేరు. ఇలా చేస్తే జరిమానా విధిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచనల మేరకు ఇది జరుగుతోంది." అని పేర్కొన్నారు. ఈ వైరల్ కథనాన్ని చదివిన ప్రజలు షాక్, కలత చెందుతున్నారు.
ఈరోజుల్లో నగలు ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. దొంగతనాలు, దోపిడీ ఘటనలు ఎక్కువవయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. అయితే దుబాయ్‌లో ఓ మహిళ ఆభరణాల భద్రతకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్‌కి చెందిన ఓ యువతి బహిరంగ ప్రదేశాల్లో ఆభరణాల భద్రతకు సంబంధించి ఆశ్చర్యకరమైన ప్రయోగం చేసింది.
ట్రక్కును నడపాలంటే ఎంతో ఏకాగ్రత అవసరం. ఏ మాత్రం అజాగ్రత్త వహించిన భారీ మూల్యం తప్పదు. అయితే.. లారీ నడిపేటప్పుడు స్టీరింగ్‌పై రెండు చేతులు ఉంచి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కాళ్లు బ్రేక్, యాక్సిలరేటర్, క్లచ్‌ను నియంత్రిస్తాయి. వీటితో పాటు చేతితో గేర్లు వేస్తాం. కానీ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కేవలం తన పాదాలతో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ.. వాహనాన్ని నడపడం కనిపిస్తుంది.
మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఢిల్లీ మెట్రోకు చెందిన వీడియోలైతే.. తరచూ చర్చలో ఉంటాయి. ఇటీవల వైరల్ అయిన వీడియోలో.. ఒక అమ్మాయి చిరిగిన దుస్తులతో మెట్రోలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇప్పుడు మరో మెట్రోకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియో ఢిల్లీ మెట్రోకు సంబంధించింది కాదు.
పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు. ఈ పిక్ కంగన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రపంచంలోని అనేక దేశాలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. మహిళల హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇరాక్ వివాహ చట్టంలో మార్పు గురించి వచ్చిన వార్తలు ఆందోళన కలిగించాయి. ఇరాక్ ప్రభుత్వం వివాహ చట్టంలో చేయబోయే మార్పుల ప్రకారం.. ఆడపిల్లల వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి 9 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు సమాచారం.
Maharshtra: దీపావళి అలంకరణ విషయంలో ముస్లిం వ్యక్తులు అభ్యంతరం తెలుపుతున్న వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. మహారాష్ట్ర నవీ ముంబైలోని పంచానంద్ సొసైటీలోని ఈ ఘటన మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది.
Gun Fire On School Van: ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో బైక్‌పై వెళ్తున్న దుండగులు స్కూల్ వ్యాన్‌పై కాల్పులు జరిపారు. ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపారని, దీంతో పిల్లలు కేకలు వేయడం ప్రారంభించారని వ్యాన్ డ్రైవర్ చెప్పాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించి వ్యాన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ పాఠశాల బీజేపీ నేతకు చెందినదని సమాచారం. ఈ ఘటనకు…
మీరు సాధారణంగా ఉబెర్ బైక్, ఉబెర్ కారుపై రైడ్ చేసి ఉంటారు. కానీ మీరు ఉబెర్ ఒంటెపై సవారి చేశారా? ప్రస్తుతం ఇలాంటి ఎ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.