Viral News: ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు సింహం బోనులోకి ప్రేమికుడు.. చివరికీ..(వీడియో)
- తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి సాహసం
- సింహాల బోనులోకి ప్రవేశించిన వ్యక్తి
- దాడి చేసి చంపిన సింహాలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి ఓ వ్యక్తి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. తన ప్రియురాలిని ఎలాగైనా మెప్పించాలని సంకల్పించాడు. దీని కోసం సింహాల బోనులోకి ప్రవేశించాడు. కానీ సింహాలకు అది అస్సలు నచ్చలేదు. సింహాలు ఆ వ్యక్తిపై దాడి చేసి చంపాయి. ఆ వ్యక్తికి సంబంధించిన చివరి క్షణాల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉజ్బెకిస్థాన్ పార్కెంట్‌లోని ప్రైవేట్ జూలో ఈ ఘటన జరిగింది.
READ MORE: Chiranjeevi : ఒలింపిక్ విజేత దీప్తి జీవాంజికి రూ.3 లక్షల చెక్ అందించిన మెగాస్టార్
Also Read
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ఉజ్బెకిస్తాన్ లోని పార్కెంట్ జూలో పనిచేస్తున్న 44 ఏళ్ల ఎఫ్ ఇరిస్కులోవ్ తెల్లవారుజామున 5 గంటలకు సింహాల బోను దగ్గరకు వెళ్లాడు. తాళం తెరిచి లోపలికి వెళ్లాడు. అక్కడ ప్రశాంతంగా కూర్చున్న సింహాల వద్దకు చేరుకున్నాడు. వీడియో ప్రారంభంలో సింహం చాలా ప్రశాంతంగా కనిపించాయి. అతడిని పట్టించుకోలేదు. కానీ.. ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా సింహాన్ని తాకుతూ.. లాలించడం ప్రారంభించాడు. అప్పుడు ఒక సింహం వచ్చి అతనిపై దాడికి యత్నించింది.
READ MORE: Pawan Kalyan: జనసేన ఆవిర్భావ దినోత్సవం.. 3 రోజుల పాటు పిఠాపురంలో ప్లీనరీ..
ఇరిస్కులోవ్ సింహాన్ని “సింబా” అని అరుస్తూ శాంతించమని చెబుతాడు. దీంతో అది వెనక్కి తగ్గుతుంది. అయితే మరో సింహం అతనిపై దాడి చేసింది. అతను బిగ్గరగా అరిచినప్పటికీ అది వినలేదు. ఈ దాడిలో ఇరిస్కులోవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మొత్తం సంఘటనను తానే స్వయంగా వీడియో తీశాడు. ఈ భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడి అనంతరం ఈ సింహాలు జూలో ఆవరణలో సంచరించాయని పోలీసులు తెలిపారు.
Un trabajador de un zoológico de Uzbekistán entró en la jaula de los leones y se lo devoraron.
Quería enviarle el video a su novia … pic.twitter.com/rR6assw26D— Isaac (@isaacrrr7) January 2, 2025
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!