పవిత్రమైన దేవాలయాల్లో కొంత మంది చేసే పిచ్చి పనుల పట్ల భక్తులు అక్కడి పూజారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ లోని కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయంను అక్కడి భక్తులు ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. అయితే రీసెంట్‌గా ఈ ఆలయం గర్భగుడిలో ఒక భక్తి పాటను చిత్రికరించారు. అది కూడా ఆలయం తలుపులు మూసి, భక్తులను ఇబ్బంది పెట్టి షూటింగ్ చేశారు. ఈ ప్రైవేటు ఆల్బం చేసింది సింగర్ మధు ప్రియ. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో అక్కడి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఆలయంలోకి ఫోన్‌లు తీసుకెళ్లి, ఫోటోలు తీసేందుకు అనుమతిలేదు. అలాంటిది వాళ్ళు ఏకంగా సెట్ లు వేసి.. గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బం షూటింగ్ చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. దీనివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఎట్టిపరిస్థితుల్లోను దీన్ని వదిలేది లేదని కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం గుడిలో వాళ్లు, దేవదాయ శాఖ అయిన దీనిపై రియాక్ట్ కాలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.షూటింగ్ చేస్తున్నారు అని తెలిసి.. చూసి కూడా వదిలేసిన అందరి పై చర్య తీసుకోవాలని భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో దుమారం లేపుతుంది.