Viral Video: హర్యానా ఫరీదాబాద్‌లో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. ఇంట్లోని బెడ్రూంలోకి ఆవు, ఎద్దు దూరాయి. దీంతో భయపడిన మహిళ, ఇంట్లోని కప్‌బోర్డులో దాక్కుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించిన పశువులు బయటకు వెళ్లలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దాదాపుగా రెండు గంటల పాటు సాయం కోసం సదరు మహిళ కప్‌బోర్డులోనే ఉంది.
Crocodile In College: సోషల్ మీడియాలో రోజుకు అనేక వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతానే ఉంటాయి. ఇందులో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఇకపోతే, సులభంగా పర్యావరణ అనుకూలతలు మార్చుకునే కొన్ని జంతువులు అప్పుడప్పుడు నగరాల్లోనూ ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఈ తరహాలోనే తాజాగా ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఓ భారీ మొసలి సంచరించి విద్యార్థులు, స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లైతే.. Read Also: CM Chandrababu:…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరిహర వీరమల్లు”. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరీ ఎక్కువ సమయం వృథా అవుతుందనే ఉద్దేశంతో దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్‌ను వీడిన విషయం తెల్సిందే. దాంతో జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
World Record: ప్రస్తుతం ఇంటర్నెట్ రాజ్యమేలుతుంది అనడంలో ఎతువంటి అతిశయోక్తి లేదు. అప్పుడప్పుడు ఇంటర్నెట్లో రకరకాల ఛాలెంజ్‌లు వైరల్ అవుతుంటాయి. కొందరు ఫన్నీ ఛాలెంజ్‌లు చేస్తుంటే.. మరికొందరు తమ ఓపిక, పట్టుదలను పరీక్షించే అసాధారణమైన సాహసాలను చేస్తుంటారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ ‘నార్మే’ ఏకంగా 38 గంటలు కదలకుండా నిలబడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. Read Also: Job Resignation: చేరిన 10 రోజుల్లోనే రూ.21లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన ఐఐఎమ్ గ్రాడ్యుయేట్.. కారణమేంటంటే? నార్మే చేసిన ఈ…
నిర్మల్ లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇవి వదంతులు మాత్రమే అని, అసత్య వార్తలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ పలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నవి అసత్యపు వార్తలని స్పష్టం చేశారు. అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని,…
రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రెండు సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారన్నారు. అలాంటి వ్యక్తి దేశానికి ప్రధాన మంత్రి ఎలా అయ్యారో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై దుమారం రేగుతోంది.
తనను తాను టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఓ వ్యక్తి 2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని షాకింగ్ అంచనాలు వేశాడు. ఆయన చెప్పిన మాటలపై ఇంటర్నెట్లో చర్చ జరుగుతోంది. టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఎల్విస్ థాంప్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన కొన్ని తేదీలను సైతం ప్రస్తావించారు.
సినిమా హాలులో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ తాగడం అందరికీ ఇష్టం. కానీ లోపల వాటి ధరలు మాత్రం మామూలుగా ఉండవు. బయటి ఫుడ్‌ని కూడా థియోటర్లోకి తీసుకెళ్ల నివ్వరు. దీని కారణంగా చాలా సార్లు జనాలు రహస్యంగా బయటి ఫుడ్ తీసుకువస్తారు. కానీ సౌదీ అరేబియాలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో సినిమా థియేటర్లోకి పెద్ద డ్రమ్ములు, బకెట్లతో వస్తున్నారు.
భూమి మీద దుస్తులు వేసుకోవడం చాలా సులభం. కానీ.. అంతరిక్షంలో దుస్తులు ధరించడం ఒక సవాలు. కానీ అనుభవజ్ఙుడైన నాసా వ్యోమగామి డాన్ పెటిట్ అంతరిక్షంలో సులభంగా దుస్తులు ధరించే పద్ధతిని జనాలకు చూపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ బయటపడింది. ఆయన తన ప్యాంటును చాలా ప్రత్యేకమైన రీతిలో ధరించారు. ఈ వీడియో ఫిబ్రవరి 21న షేర్ చేశారు. వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తన డ్రెస్సింగ్ టెక్నిక్‌ను ప్రదర్శించారు. దీనిని చూసి…
Maha Kumbh: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అద్భుతంగా నిర్వహించింది. జనవరి 13 న ప్రారంభమైన ఈ అద్భుత కార్యక్రమం శివరాత్రి రోజు ఫిబ్రవరి 26తో ముగుస్తోంది. ఇప్పటివరకు దేశ విదేశాల నుంచి త్రివేణి సంగమానికి వచ్చిన భక్తుల సంఖ్య 60 కోట్లు దాటినట్లు సీఎం యోగి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా టెంపుల్ టూరిజం పెరిగింది. ప్రయాగ్‌రాజ్‌తో పాటు అయోధ్య, వారణాసి, మథురలకు పెద్ద…