ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు. అయితే.. కొన్ని కొన్ని విషయాల గురించి తెలుసుకున్నప్పుడు ఒకింత ఆశ్చర్యంగా ఉంటుంది. సినిమాలో చనిపోకముందే సమాధి బుకింగ్ అనే ఓ కామెడీ సన్నివేశం గుర్తిండే ఉంటుంది. అయితే ఆ సినిమాలో కామెడీనే.. కానీ ఇక్కడ రియల్.. సమాధిలో మనిషిని పూడ్చిన తరువాత.. ఆ సమాధికి బార్ కోడ్ను ఏర్పాటు చేస్తారు. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ సమాధిలో ఏ వ్యక్తిని పూడ్చిపెట్టారో తెలుస్తుంది. అంతేకాకుండా పూడ్చిపెట్టిన వ్యక్తి…
రోడ్లమీద లారీలు భారీ లోడ్ తో వెళుతుంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యమో.. రోడ్డు మీద సమస్య వల్ల లారీలు బోర్లాపడుతుంటాయి. ఆ లారీల్లో బీరు బాటిళ్ళు, సెల్ ఫోన్లు, చేపల లోడ్ వి అయితే సమీప ప్రాంతాల ప్రజలకు పండగే పండుగ. తాజాగా భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద అదుపు తప్పి చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. ఘటనస్థలానికి భారీగా తరలివచ్చిన జనం పండుగ చేసుకున్నారు. నిమిషాల్లో లారీ లోడ్ చేపల్ని మాయం చేసేశారు. భద్రాద్రి…
మాస్ మహారాజా రవితేజ నటించిన కిక్ సినిమా అందరు చూసే ఉంటారు.. కిక్కు కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ సినిమాను చూసి ప్రేరణ పొందాడో ఏమో కానీ ఒక యువకుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడున్నర కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశావ్ అంటే బోర్ కొడుతోంది.. కిక్కులేదని చెప్పడం విశేషం.. ఇంతకీ ఎవరా మహానుభావుడు అని తెలుసుకోవాలని ఉందా.. సరే చూద్దాం పదండి. నెట్ఫ్లిక్స్ ఎంత పెద్ద…
ప్రతి ఉద్యోగి జీవితంలో రిటైర్మెంట్ అనేది అనివార్యం. అయితే.. ఇంచుమించు ఇంటితో సమానంగా ఉద్యోగ సమయంలో కార్యాలయాలలో గడుపుతుంటారు. అంతేకాకుండా ఆఫీసులోని సహోద్యోగులకు పెరిగిన బంధం కూడా తక్కువేం ఉండదు. అయితే.. ఇదే పదవి విరమణ ఉపాధ్యాయులకు మరింత ప్రత్యేకమని చెప్పాలి. పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఉండే అనుబంధం అంతాఇంతా కాదు. ఉపాధ్యాయులు బదిలీపై వెళుతుంటే.. వెళ్లవద్దంటూ ఏడ్చేసిన సంఘటన కొన్ని వైరల్ అయ్యాయి కూడా. అయితే ఇప్పుడు చెప్పేది కూడా అలాంటిదే.. తను 22 ఏళ్ల…
అక్కడ ఒక బకెట్ నీళ్లుకావాలన్నా బావిలోకి దిగాల్సిందే.. ఎలాంటి సాయం లేకుండా కేవలం బావిలోని రాళ్లనే మెట్లుగా చేసుకొని ఎక్కడం దిగడం చేయాల్సిందే.. ఎక్కటప్పుడో దిగేటప్పుడో ప్రమాదవశాత్తు కాలజారితే భారం అంతా భగవంతుడిపైనే.. నీటి ఎద్దడికి నిలువుటద్దంలా ఓ మహిళ బావిలో దిగి నీళ్లు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతను ఈ వీడియో సాక్షిబూతమవుతోంది. వీడియోలో ఓ మహిళ నీటి కోసం ఎలాంటి తాడు, నిచ్చెన సాయం…
మా ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయింది వెతికిపెట్టండి. మా ఇంట్లో పిల్లి కనిపించడం లేదు. మా ఇంట్లో నెక్లెస్ పోయింది.. వాళ్ళ మీద అనుమానంగా వుంది. ఆ సంగతి చూడండి అంటూ పోలీసులకు కంప్లైంట్లు రావడం కామన్. అసలే రాజకీయంగా ఎవరిమీద కేసులు పెట్టాలి, అధికార పార్టీ నేతల నుంచి వచ్చే కంప్లైంట్స్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రోజులివి. దానికి తోడు ఇతర నేరవార్తలు వారిని నిలువ నీయకుండా చేస్తుంటాయి. బంగారు, నగదు దోచుకెళ్లారని…
ఒక్కొక్కరు ఒక్కో రకమయిన అభిరుచిని కలిగి వుంటారు. కొందరు ట్రెక్కింగ్ ఇష్టపడతారు. మరికొందరికి నడక అంటే ఇష్టం. సముద్రాలు, టూరిస్టు ప్రాంతాలకు వెళుతుంటారు. ఇండోనేషియాలోని బాలి గొప్ప పర్యాటక ప్రాంతం. అక్కడికి ఏటా లక్షలమంది పర్యాటకులు వెళుతుంటారు. ఇండోనేషియాలోని ద్వీపం బాలి. పర్యాటకులు దీనిని భూతల స్వర్గంగా భావిస్తారు. అలాంటి ప్రాంతంలో ఓ ఫోటోగ్రాఫర్ చేసిన అందరినీ సంభ్రమాశ్చర్యాలకు, మరికొందరిని టెన్షన్ కి గురిచేసింది. ఎర్త్పిక్స్ పేరుతో వున్న ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఉత్కంఠభరితమైన వీడియోను పోస్ట్…
సాధారణంగా ఎక్కడ చూసినా ఆలయాల్లో ప్రసాదం పేరిట పులిహోర లేదా కేసరి లేదా దద్దోజనం లేదా లడ్డూలు అందిస్తుంటారు. కానీ ఏపీలోని అన్నవరం దేవస్ధానంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ఆలయంలో ప్రసాదం కింద భక్తులకు గోధుమ నూకతో చేసిన ప్రసాదం అందిస్తారు. ఈ ప్రసాదం రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రసాదం మరెక్కడా దొరకదు. తిరుపతి లడ్డూ ఎంత ప్రసిద్ధి చెందిందో.. అన్నవరం ప్రసాదం కూడా అంతే ఆదరణ పొందింది. అన్నవరం ఆలయంలో గోధుమ…
మంచి ఆకలి మీద వున్న మీరు ఏదైనా హోటల్ కి వెళ్ళి బిర్యానీ తినాలనుకుంటారు. బిర్యానీ పార్శిల్ తెచ్చుకుని తిందామని అనుకుంటే.. మీకు అనుకోని అతిథి వచ్చి మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తాడు. ఆ అతిథి ఎవరో కాదు ఏ బల్లో లేదా బొద్దింకో. అంతే మీ మూడ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. హైదరాబాద్ కి చెందిన ఓ వినియోగదారుడి బిర్యానీలో బల్లి ప్రత్యక్షమయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓ బిర్యానీ హోటల్ లో బిర్యానీ కొన్నాడు…
సాధారణంగా పెళ్లంటే పెళ్లి కొడుకు తాళి కట్టాలి కానీ అక్కడ మాత్రం పెళ్లి కూతురు కూడా తాళి కట్టాల్సిందే. అది అక్కడి ఆచారం. అంతేకాదు పెళ్ళికొడుకు నల్ల కళ్ళజోడు పెట్టుకొని మెడలో నోట్ల దండ వేసుకుంటేనే పెళ్లి జరుగుతుంది. అది కూడా ఆ ఊరి ఆచారం. అంతేకాదండోయ్ ఒకే రోజు ఒకే ముహూర్తానికి వందల పెళ్లిళ్లు జరుగుతాయి. ఇది ఎక్కడ వింత ఆచారం తంతు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే.. సహజంగా…