వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు మనం రంగును చూస్తాం.. కానీ అన్ని వాహనాలకు టైర్లు మాత్రం నల్లరంగులోనే ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎంత ఖరీదైన వాహనం అయినప్పటికీ వాటి టైర్లు నల్ల రంగులోనే ఉంటాయి. అయితే టైర్లు నల్లరంగులోనే ఎందుకు ఉంటాయో చాలా మందికి తెలియదు. దాదాపు 125 సంవత్సరాల క్రితం టైర్లు తెలుపు రంగులోనే తయారు చేయబడ్డాయి. టైర్ల తయారీలో ఉపయోగించే రబ్బరు మిల్కీ వైట్‌గా ఉంటుంది. కానీ 1912 తర్వాతే టైర్లకు నల్లరంగు వచ్చింది.
ఎందుకంటే టైర్ల తయారీలో ఉపయోగించే రబ్బర్‌కు స్థిరత్వాన్ని కలిగించేందుకు కార్బన్ బ్లాక్‌ను జోడించడం జరిగింది. కార్బన్ బ్లాక్ అనేది మిల్కీ వైట్ మెటీరియల్‌లో స్థిరమైన స్థాపన పదార్ధంగా సైంటిస్టులు గుర్తించారు. మెటీరియల్‌కు కార్బన్ బ్లాక్ జోడించడం వల్ల టైర్ పూర్తిగా నల్లగా మారుతుంది. కార్బన్ బ్లాక్ టైర్‌కు చాలా కాలం మన్నికతోపాటు బలంగా ఉంటుంది. కార్బన్ బ్లాక్ వాహనంలోని అన్ని విభాగాల నుంచి వేడిని తొలగిస్తుంది. అందుకే వేడిగా ఉన్నప్పుడు, రోడ్డు, టైర్ మధ్య ఘర్షణ వేడి ఉన్నప్పుడు టైర్లు కరగవు. అంతేకాకుండా ఏ వాతావరణంలో అయినా టైర్లు స్థిరంగా చెడిపోకుండా ఉంటాయి. సాధారణంగా సూర్యరశ్మి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల కారణంగా రబ్బరు టైర్లు పగుళ్లు ఏర్పడతాయి. కానీ అతినీలలోహిత కాంతి, ఓజోన్‌ల ప్రభావం నుంచి వచ్చే హానికరమైన ప్రభావాల నుంచి టైర్లను రక్షించడంలో కార్బన్ బ్లాక్ సహాయపడుతుంది. వాహనాలు రోడ్లపై ప్రయాణించే సమయంలో రోడ్డు గుంతలు, రాళ్లు ఉన్నా.. కార్బన్ కారణంగా టైర్లకు ఎలాంటి హాని జరగదు. కార్బన్ బ్లాక్ వల్ల టైర్లు పగిలిపోయే అవకాశం ఉండదు.