ఒక్కో దేశంలో ఒక్కో రకంగా చట్టాలు ఉంటాయి. అక్కడి చట్టాలు కొన్ని మనకు వింతగానే అనిపిస్తుంటాయి. ఇటీవల ఓ గొర్రె ఒక మహిళను చంపినందుకు అరెస్ట్ చేసిన విషయం తెగ వైరల్ అయింది. తాజాగా ఇలాంటి ఘటనే మళ్లీ జరిగింది. ఒక బాలుడిని చంపినందుకు ఆవును అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆఫ్రికా దేశం సౌత్ సుడాన్ లో జరిగింది.
ఈ విచిత్రమైన ఘటనలో 12 ఏళ్ల బాలుడిని చంపిన ఆవును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు దాని యజమానిని పోలీసులు అదుపులోకి తీసకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత వారం సాయంత్రం ఒక పొలం దగ్గర నడుచుకుంటూ వెళ్తుండగా.. పిల్లవాడిపై ఆవు దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన బాలుడు అక్కడిక్కడే మరణించాడు. ఆవు నాగలి లాగే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది
ఈ ఘటనపై దక్షిణ సుడాన్ పోలీస్ అధికారి ఎలిజా మాబోర్ మాట్లాడుతూ.. ఆవును రుంబెక్ సెంట్రల్ కౌంటీలోని పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశామని.. బాలుడిని పోస్ట్ మార్టంకు తరలించి ఆ తరువాత అంత్యక్రియల కోసం ఇంటికి పంపించామని తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఇదే దేశానికి చెందిన ఓ 45 ఏళ్ల అదీయు చాపింగ్ అనే మహిళను పొట్టేతలు పక్కటెముకల్లో పొడిచిపొడిచి చంపింది. ఈ ఘటనలో పొట్టేలును అరెస్ట్ చేసి.. దాన్ని సైనిక శిబిరంలో ఉంచారు. పొట్టేలుకు మూడేళ్ల కఠిక కారాగార శిక్ష విధించారు. ఈ శిక్ష ముగిశాక అక్కడి చట్టాలు, సంప్రదాయాల ప్రకారం చాపింగ్ కుటుంబానికి పొట్టేలును అప్పగించనున్నారు.