తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుకు ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నికొన్ని క్లిష్ట సమయాల్లో.. స్వయంగా తానే రంగంలోకి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఓ సారి పుష్కరాల సమయంలో తానే స్వయంగా పుష్కరఘాట్ క్యూలైన్ల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా చూశారు. అయితే ఆయనకు ఆయన నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉందని అనడానికి ఈ ఫోటో నిదర్శనం. మంత్రి హరీష్ రావు ఈ…
స్మార్ట్ సిటీ విశాఖలో అదో స్మార్ట్ భవనం. దూరం నుంచి చూస్తే రోటీన్ గానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే ఔరా…!!.అనిపిస్తుంది. ఇంతకు ఏమిటా బిల్డింగ్ ప్రత్యే కత. ఇంత స్మార్ట్ ఆలోచన వెనుక ప్రేరణ ఎవరు..!? అలా విశాఖ వరకూ వెళ్ళొద్దాం రండి. విశాఖలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో ప్రధానమైనది గురుద్వారా జంక్షన్. ఇక్కడ ఉన్న ఓ హోటల్ నిర్మాణం రోటీన్ కు భిన్నంగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నిర్మాణం 100శాతం గ్రీన్ బిల్డింగ్.…
ప్రస్తుతం నిమ్మకాయ రేటు ఆకాశాన్ని అంటుతోంది. కేజీ నిమ్మకాయల ధర రూ.200పైగా పలుకుతోంది. దీంతో పలువురు వంటల్లో నిమ్మకాయ పులుపు చాలావరకు తగ్గించేశారు. చాలా చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లలో ఉల్లిపాయతో పాటు నిమ్మకాయ ఇవ్వడం మానేశారు. అదేదో సినిమాలో వరంగల్‌లో నిమ్మకాయను ఏమంటారంటే నిమ్మకాయనే అంటారనే కామెడీ డైలాగ్ తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఉల్లిపాయని నిమ్మకాయ అనాల్సి వస్తోంది. అదేంటి నిమ్మకాయను ఉల్లిపాయ అనడమేంటని అనుకుంటున్నారా? దీని కథేంటో పూర్తిగా తెలుసుకుందాం…
కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారులు అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అందుకోసం బంపర్ ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం పెట్రోల్, నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలోని ఓ షాప్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేలా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించాడు. సెల్‌ఫోన్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలను ఉచితంగా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే… యూపీలోని వారణాసికి చెందిన మొబి వరల్డ్ షాప్ అనే స్టోర్ యజమాని తమ స్టోర్‌లో రూ.10వేలకు పైగా విలువైన…
మెటావర్స్..! టెక్ ప్రపంచంలో ఇదే లేటెస్ట్ ట్రెండ్. సరికొత్త సాంకేతిక మాయాలోకం. కంప్యూటర్‌పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. ఫిజికల్ గా మన ప్రసెన్స్ లేకపోయినా… అవతార్ల రూపంలో లైవ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. చర్చలు.. సమావేశాలే కాదు.. రోజువారీ భౌతిక ప్రపంచంలో చేసే పనులన్నీ మెటావర్స్ వేదికగా చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ టెక్నాలజీని తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి వినియోగించుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ కొత్తగా రూపొందించిన తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఆవిష్కరణకు మెటావర్స్…
తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన చుట్టూ ఉన్నవారికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నా అని ముందుంటారు. మొన్నామధ్య ముడిమ్యాల క్యాసారం గేట్ల మధ్య ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అదే సమయంలో వికారాబాద్ పర్యటన ముగించుకుని మొయినాబాద్ వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద స్థలం వద్ద తన కాన్వాయ్ అపి క్షతగ్రాతులను ప్రత్యేక వాహనంలో తరలించారు. అంతేకాకుండా ఆ తరువాత ఆ ప్రమాదంలో గాయపడ్డ వారి యోగక్షేమాలపై ఆరా…
సింహం.. అడవికి రాజు. సింహాన్ని చూస్తే ఏ జంతువైనా పరుగులు పెడుతుంది. జింకల్లాంటివి అయితే బతుకు జీవుడా అంటూ దొరక్కుండా పారిపోతాయి. కానీ చిన్న జంతువులు సింహం జోలికి రావు. కానీ ఓ చెరువులో నీళ్లు తాగుతున్న సింహాన్ని.. ఆ నీటిలో ఉన్న బుల్లి తాబేలు చుక్కలు చూపించింది. బాగా ఆటపట్టించిన తీరు నెటిజన్లను ఫిదా చేసింది. Read Also: Ranbir-Alia Video Viral : మోకాళ్లపై కూర్చుని, లిప్ లాక్ తో… సినిమాను మించిన వరమాల…
ముస్లింలకు ఎంత పవిత్రమైన మాసం రంజాన్ నెల. ఈ రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్దలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తుంటారు. అయితే రంజాన్ వచ్చిదంటే చాలు.. పట్టణాల నుంచి గ్రామాల వరకు వివిధ రకాల వంటకాలు దర్శనమిస్తుంటుయి. ఇది హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. పత్తర్‌కా ఘోష్ లాంటి ఎన్నో అరుదైన వంటకాలను ఈ రంజాన్ మాసంలో టేస్ట్ చేయవచ్చు. అయితే రంజాన్ నెలలో కేవలం ముస్లింలే కాకుండా మాంసాహార ప్రియులందరూ ఈ వంటకాలను ఆస్వాదిస్తుంటారు. ఎన్ని వంటకాలు…
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను అధికారులు భద్రపరచారు. వారిలో ఒకరిని బంధువు గుర్తించడంతో మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తరువాత అసలు విషయం తెలిసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఓజీహెచ్ మార్చురీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేర్వేరు కేసుల్లో మృతదేహాలను మైలార్‌దేవ్‌పల్లి, ఎస్ఆర్నగర్ పోలీసులు మార్చురీకి తీసుకొచ్చి గుర్తింపు కోసం ఉంచారు. అయితే గురువారం ఓ బంధువు వచ్చి ఒక మృతదేహాన్ని గుర్తించడంతో అధికారులు మృతదేహాన్ని కుటుంబ…
నంద్యాల జిల్లాలో జగన్ వసతి దీవెన సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ వ్యాఖ్యలపై బీజేపీ భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు, పత్రికలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. వారిని ఉద్దేశించి వెంట్రుక కూడా పీకలేరని సీఎం జగన్ అనడం బాధాకరం అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్యకర పదజాలం వాడటం బాధాకరం. వెంట్రుక పీకడానికి, గుండు కొట్టించుకోవడానికి సీఎం పదవి ఎందుకు? జగన్…