Viral Pamphlet : నాకు వరుడు కావాలి.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. అబ్బాయిని చూడమని బంధువులు, సన్నిహితులకు చెబుతుంటారు. అయితే ఝార్ఖండ్ హజారీబాగ్‌కు చెందిన ఓ యువతి మాత్రం తన సంబంధం తానే చూసుకుంటోంది. తనకు ఎలాంటి వరుడు కావాలో చెబుతూ ఓ యువతి ఇచ్చిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని జెండా చౌక్ సమీపంలో నివసించే బంగాలీ దుర్గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, తనకు తగ్గ వరుడిని తానే వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా పత్రికలో ప్రకటన కూడా ఇచ్చింది. ఆపై ఓ పెళ్లి వేడుకలో గోడలపైనా ఆ ప్రకటన అంటించింది. దీంతో ఆ వేడుకకు హాజరైన వారి దృష్టి దానిపై పడింది.
ఆ ప్రకటనలో తనకు ఎలాంటి వాడు కావాలో పూసగుచ్చినట్లు తెలిపింది. ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలి అంటూ రెండు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చింది. ఇంతకీ యువతికి ఏం క్వాలిటీస్ కావాలంటే.. అబద్ధాలు అస్సలు చెప్పకూడదట. పిసినారితనం ఉండకూడదు. ఏ కులానికి చెందిన వాడైనా అభ్యంతరం లేదు. మరీ ఎక్కువ చురుగ్గా ఉండనవసరం లేదు. కాస్త చురుగ్గా ఉంటే చాలు. నాకంటే చిన్నవాడైనా సరే ఆసక్తి ఉంటే సంప్రదించండి అంటూ సదరు యువతి వరుడి కోసం ఇచ్చిన ప్రకటన కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Also Read
- Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
- Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
- Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
- Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..