Salman khan : సల్మాన్ ఖాన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతనికి ఇప్పటికీ అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిలే కాదు హీరోయిన్లు కూడా అతనికి ఫ్యాన్స్ గా ఉంటారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ సల్మాన్ ఖాన్ పోస్టర్ ను ఏకంగా తన బాత్రూమ్ లో పెట్టుకుంది. ఆ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా బయటపెట్టాడు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్న సల్మాన్.. తన పోస్టర్లను సెలూన్, బట్టల దుకాణాలు, రోడ్ల మీద ఎలా వాడుకుంటున్నారో చెప్పాడు.
Read Also : Sitaare Zameen Par : అమీర్ ఖాన్ మూవీ చూసిన రాష్ట్రపతి
అదే సమయంలో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ బాత్రూమ్ లో తన పోస్టర్ పెట్టుకుందని చెప్పాడు సల్మాన్ ఖాన్. నేను వేరే వ్యక్తి ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. ఓ సారి కరీనా ఇంటికి వెళ్లినప్పుడు స్వయంగా చూసి షాక్ అయ్యాను. అప్పుడు ఆమె వయసు 8 ఏళ్లు. కరీనాకు 15 ఏళ్లు వచ్చాక నా ఫొటో తీసేసి రాహుల్ రాయ్ ఫొటో పెట్టుకుంది అంటూ తెలిపాడు సల్మాన్ ఖాన్.
సల్మాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సల్మాన్, కరీనా చాలా సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్లో వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. కరీనా ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ తో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
Read Also : Vijay Anthony : తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పెరిగింది.. హీరో విజయ్ కామెంట్స్..