Ariyana : బిగ్ బాస్ తో అరియానా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుంచే వరుసగా ఆఫర్లతో దూసుకుపోతోంది. బిగ్ స్క్రీన్ మీద ఆఫర్లు రావట్లేదు గానీ.. బుల్లితెరపై బాగానే ఛాన్సులు వస్తున్నాయి. రెండు సార్లు బిగ్ బాస్ కు వెళ్లిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బుల్లితెరపై ఛాన్సులు అందుకుంటోంది. తాజాగా తన లవ్ స్టోరీని మరోసారి చెప్పింది. నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుమే లవ్ లో పడ్డాను. అతను విజయవాడలో ఉండేవాడు. నేను తాండూరులో ఉండేదాన్ని. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటి నుంచి హైదరాబాద్ కు వచ్చాను. అప్పుడే మా బావకు జాబ్ వచ్చింది. దీంతో ఇద్దరం కలిసి ఒకే రూమ్ తీసుకుని మూడేళ్లు కలిసి ఉన్నాం. చాలా డీప్ గా కనెక్ట్ అయిపోయాం అంటూ తెలిపింది అరియానా.
Read Also : IND vs ENG: ఎంతకు తెగించార్రా.. గిల్‌ను అవుట్ చేయలేక ఇలాంటి సిల్లీ ఐడియాస్ ఏంటో..!
ఆ తర్వాత తనకు నేను బోర్ కొట్టేశానేమో. ఓ రోజు చూడకూడనిది చూశాను. అప్పుడే నా గుండెలు పగిలిపోయాయి. ఆ తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉన్నాం. మళ్లీ అతను రిక్వెస్ట్ ఇంకో రెండేళ్లు కలిసి ఉన్నాం. అప్పుడే నాకు ఆర్జే కావాలని ఉందని తెలిపాను. తను కూడా ఒప్పుకుంటే ఓ ప్రాక్టీస్ కోర్స్ లో చేరా. అప్పుడు నాకు ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. అది మా బావకు నచ్చలేదు. నాపై అనుమానం పెంచుకున్నాడు. కావాలనే నన్ను అనుమానంతో టార్చర్ చేశాడు. కానీ ఆ అబ్బాయితో నాకు ఎలాంటి రిలేషన్ లేదు. మా బావది నాది జస్ట్ మిస్ అండర్ స్టాండింగ్. దాంతోనే విడిపోయాం. ఇప్పటికీ అతను నాకు గుర్తుకు వస్తాడు. తను నన్ను బాగా చూసుకునేవాడు. మా నాన్నలేకపోవడంతో అతని కేరింగ్ కు అడిక్ట్ అయిపోయాను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది అరియానా. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
Read Also : Vijay Devarakonda : విజయ్ కోసం రూ.2 కోట్ల సెట్..?